‘మర్డర్ 3’లో అడల్ట్ సెక్స్ చిత్రాల తార
సంచలన చిత్రాల దర్శకుడు మహేష్ భట్ మర్డర్ 3 చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇమ్రాన్ హస్మి ప్రధాన పాత్రలో నటించనున్నాడు. తాజాగా అందిన సమచారం ప్రకారం ఈ సినిమాలో అడల్ట్ చిత్రాల శృంగార తార సన్నీలియోన్ తో నటింప చేయాలని నిర్మాత భావిస్తున్నట్లు బాలీవుడ్ టాక్. సన్నీ లియాన్ అంటే ఓవరో ఫారన్ అమ్మాయి అనుకునేరు. ఇండియా నుంచి వెళ్లి కెనడాలో సెటిలైన భారతీయ కుటుంబానికి చెందిన భామే. ఆమె అసలు పేరు కరణ్ మల్రోత్రా. అక్కడ సెక్స్ చిత్రాల్లో నటించడం మొదలు పెట్టాక పేరు మార్చుకుంది.
ఈ భామ తొలుత హోమో సెక్స్ వల్(ఆడ-ఆడ) చిత్రాల్లో నటించేది. 2008 నుంచి మగాళ్లతో కలిసి సెక్స్ చిత్రాల్లో నటిస్తోంది. 2010లో సన్నీలియోన్ టాప్ 12 ఎక్స్ రేటెడ్(పెద్దలకు మాత్రమే పరిమితం అయిన సెక్స్ చిత్రాలు)స్టార్ గా ఘనత సాధించిది కూడా. ప్రస్తుతం సన్నీ లియోన్ బిగ్ బాస్ 5 షోలో ఎంటర్ అయింది. ఈ క్రమంలోనే మహేష్ భట్ కన్ను ఆమెపై పడింది.
ఈ సినిమాలో సన్నీ లియోన్ మహేష్ భట్ కుమారుడు రాహుల్ భట్ తో కలిసి ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో నటించనుందట. తొలిసారి గా వెండితెరకు పరిచయం అవుతున్న రాహుల్ తొలి ప్రయత్నంలోనే ఫోర్న్ స్టార్ తో రొమాన్స్ చేసే అవకాశం దక్కడంతో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











