నోరు వెళ్ల బెట్టేలా....: సన్ని లియోన్ ...నైట్ ఛార్జ్
హైదరాబాద్: గూగుల్ సెర్చింగ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న సన్నిలియోన్ ఒక రాత్రంతా తన అందచందాలతో మనని ఆనందపరచటానికి ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ జూబ్లిహిల్స్ కన్వెక్షన్సెంటర్ నిర్వాహకులు. అయితే అందుకోసం ఆమె ఛార్జ్ చేసేదెంతో తెలుస్తే నోరు వెళ్లబెడతారు. అక్షరాలా ఐదు కోట్ల రూపాయలు..ఆమె ఆ ఒక్క రాత్రి బాలీవుడ్ హాట్ సాంగ్స్ కు తన డాన్స్ లకు ఆమె తీసుకుంటుంది. సన్నిలియోన్ వస్తు్న్న విషయాన్ని కన్వెక్షన్ నిర్వాహకులు ఖరారు చేసారు. అయితే సెలెక్టెడ్ గెస్ట్ లను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు చెప్తున్నారు. ఇందతా ఏ రాత్రో అర్దమయ్యే ఉంటుంది. అదే..డిసెంబర్ 31 రాత్రి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
సన్నిలియోన్ ప్రస్తుత చిత్రాల విషయం కు వస్తే..
సన్నిలియోన్ అంటేనే కుర్రకారు హీట్ ఎక్కిపోతున్నారు. దాన్ని క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు క్యూలు కట్టేస్తున్నారు. సన్నిలియోన్ సైతం వీరికి సహకరిస్తూ తన ఇమేజ్ కు తగ్గ పాత్రల్లో నటిస్తూ రెచ్చిపోతోంది. తాజాగా కుచ్ కుచ్ లోచా హై అంటూ ఆమె కనిపించనున్న హిందీ చిత్రంలో మరోసారి తన అంగాంగ ప్రదర్శనకు సిద్దం అయ్యింది.
దేవంగ్ దోల్కియా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి మొదట పటేల్ రాప్ అనే పేరు పెట్టారు కానీ ..ఇప్పుడు రామ్ కపూర్ తో ఆమె పెయిర్ ని చూసాక ఈ కుచ్ కుచ్ లోచా హై అని పెట్టాలనిపించిందిట. దాంతో ఇదిగో ఇలా టైటిల్ ఖరారు చేసి ఫస్ట్ లుక్ వదిలేసి హంగామా చేస్తున్నాడు. ఈ చిత్రంలో సన్నీ సినిమా తార పాత్ర పోషిస్తుంది. ఈ పాత్ర ప్రముఖ హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోను పోలి ఉంటుంది. రామ్ కపూర్ ప్రధాన పాత్రధారి. సన్నీ నటిస్తున్న చిత్రాల్లో 'యు' సర్టిఫికెట్‌పొందే తొలి చిత్రం ఇదే కావచ్చు.

సన్నిలియోన్ సైతం ఈ చిత్రం ప్రమోషన్ ని తన భుజాల మీద పెట్టుకుంది. అందుకు తగినట్లే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఈ చిత్రం పోస్టర్లను, ఫస్ట్ లను పంచుతూ హంగామా చేసి చిత్రానికి క్రేజ్ క్రియోట్ చేస్తోంది.
దర్శకుడు మాట్లాడుతూ.... ''సినిమాలో సన్నీ లియోన్ కథానాయిక పాత్ర పోషిస్తున్నా ఎక్కడా అభ్యంతరకర సన్నివేశాలుండవు. ముద్దు సన్నివేశాలకు ఆస్కారం లేదు. కుటుంబమంతా కలసి చూసేలా సన్నీ పాత్ర ఉంటుంది. మార్లిన్ మన్రో- జాక్ లెమ్మాన్ తరహా కెమిస్ట్రీ సన్నీ- రామ్‌ల మధ్య ఉంటుంది.అశ్లీలత లేని వినోదం ఉంటుంది''అని చెప్పారు.
సన్నిలియోన్ మాట్లాడుతూ... ‘‘ఇప్పటి వరకు బాలీవుడ్‌లో మంచి సినిమాల్లో నటించాను. కొన్ని సినిమాల షూటింగ్ చాలా ఫన్నీగా ఉండేవి. వాటిని ఎంతగానో ఎంజాయ్ చేసేదాన్ని. ఇంకొన్ని సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయా అని చూసేదాన్ని. సెట్‌లో ఫన్ మిస్ చేసుకొని తిరిగి ముంబయి వెళ్ళడం కాస్త బాధగా ఉంది. ఈ విధంగా అనిపించడం ఇదే మొదటిసారి. సపోర్ట్ చేసిన టీమందరికీ నా కృతజ్ఞతలు'' అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











