ఇంకో తెలుగు సినిమాలో సన్నిలియోన్ భజన

By Srikanya

హైదరాబాద్ : కరెంట్ తీగ చిత్రంలో కనిపించి మురిపించిన సన్నిలియోన్ మరోసారి తెలుగు తెరపై వినపించినుంది. ఆమె పేరిట ఓ మసాలా ఐటం సాంగ్ ని చిత్రీకరించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం ద్వారా గుర్తింపు పొందిన జెన్నీఫర్ ఈ పాటలో నర్తించింది. గణేష్ మాస్టర్ నృత్యాలని సమకూర్చిన ఈ పాట జనాల్లోకి బాగ చొచ్చుకుని వెళ్తుందని దర్శకుడు శ్రీనివాస్ చెప్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రిన్స్, జ్యోతిసేథీ, సంపూర్ణేష్‌బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వేర్ ఈజ్ విద్యాబాలన్. శ్రీభ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై ఎల్.వేణుగోపాల్‌రెడ్డి, పి.లక్ష్మీనరసింహారెడ్డి నిర్మించారు. శ్రీనివాస్ దర్శకుడు.

శ్రీకాంత్ మాట్లాడుతూ.... టైటిల్ ఆసక్తిని రేకెత్తించేలా వుంది. ప్రిన్స్ నాకు తమ్ముడులాంటి వాడు. మేమిద్దరం కలిసి సీసీఎల్ క్రికెట్ ఆడాం. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. కామెడీ, రొమాన్స్‌తో పాటు ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురిచేసే అంశాలున్న చిత్రమిదని ప్రిన్స్ తెలిపారు. విద్యాబాలన్ ఎవరూ అనే అంశమే సినిమాలో ఆసక్తికరంగా వుంటుందని దర్శకుడు అన్నారు.

Sunny leone item song in another Telugu film

దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ టైటిల్‌కు మంచి స్పందన లభిస్తోంది. విద్యాబాలన్ ఎవరూ అనే అంశమే సినిమాలో ఆసక్తికరంగా వుంటుంది. సస్పెన్స్ ప్రధానంగా సాగే చిత్రమిది. ఇటీవలే సన్నీలియోన్ పేరుమీద వచ్చే ఐటెంసాంగ్‌ను చిత్రీకరించాం. ఇందులో జెన్నిఫర్ అద్భుతంగా నర్తించింది. గణేష్ మాస్టర్ నృత్యరీతుల్ని సమకూర్చిన ఈ పాట యువతరాన్ని ఆకట్టుకుంటుంది అన్నారు.

వచ్చే వారం ఆడియోను విడుదల చేసి ఈ నెలాఖరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు.

జయప్రకాష్‌రెడ్డి, రావు రమేష్, ఆశిష్‌విద్యార్థి, సప్తగిరి, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చిట్టిబాబు, సంగీతం: కామ్రాన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X