సన్నిలియోన్ దగ్గర మంచు హీరో పాఠాలు
హైదరాబాద్ : మంచు కుటుంబ హీరోల్లో మంచు మనోజ్ ది విభిన్న తరహా. ఎప్పుడూ ఏదో కొత్తదనం తన చిత్రాల్లో ఆవిష్కరించాలని నిరంతరం తాపత్రయపడుతూంటారు. తాజాగా ఆయన తన చిత్రంలో సన్నిలియోన్ కి అవకాసం ఇచ్చాడని సమాచారం. ఈ చిత్రంలో ఆమె టీచర్ గా కనిపిస్తుందని తెలుస్తోంది. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో సన్నివేశాలు పూర్తి కామెడీతో సాగుతాయని చెప్తున్నారు. సన్నిలియోన్ ఈ చిత్రంలో ఎంట్రీ ఇస్తే ఇక్కడ బిజీ అవటం ఖాయం.

ఇక మంచు విష్ణుతో 'దేనికైనా రెడీ' అనిపించారు జి.నాగేశ్వరరెడ్డి. ఇప్పుడు తమ్ముడు మనోజ్‌తో కరెంట్ తీగ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మంచు మనోజ్ - జి.నాగేశ్వరరెడ్డి కలయికలో ఈ చిత్రం రూపుదిద్దుకొంటోంది. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో ఆకట్టుకొన్న రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్ . ఈ చిత్రానికి 'కరెంటు తీగ' అనే పేరును పరిశీలిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.
మనోజ్ శైలికి తగినట్టే ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. యాక్షన్ అంశాలకూ ప్రాధాన్యం ఉంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. 'పాండవులు పాండవులు తుమ్మెద' తరవాత మనోజ్ నటిస్తున్న చిత్రమిదే.


Click it and Unblock the Notifications











