Just In
- 15 min ago
మనం 2లో మరో ఇద్దరు యువ హీరోలు.. స్టోరీ ఎంతవరకు వచ్చిందంటే?
- 24 min ago
విడుదలకు ముందే బయటకు: ‘ఆచార్య’ టీజర్ హైలైట్స్ ఇవే.. చివరి ఐదు సెకెన్స్ అరాచకమే!
- 1 hr ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 1 hr ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
Don't Miss!
- News
మదనపల్లె కేసు రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ అంశాలు .. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గాజు ముక్కలు
- Sports
టీమిండియా ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది.. ఓడించడం కష్టమే: ఇంగ్లండ్ మాజీ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చుక్కలు చూపించిన సన్నీలియోన్.. స్టార్ హీరోయిన్సే నోరెళ్లబెట్టేలా!
రసిక ప్రియుల ఆరాధ్య దైవం సన్నీలియోన్ ఓ తెలుగు నిర్మాతకు చుక్కలు చూపించిందట. తాను రూపొందించబోయే కొత్త సినిమాలో సన్నీలియోన్ తో ఓ రోల్ చేయించాలని భావించిన సదరు నిర్మాత ఆమెను సంప్రదించారట. అయితే.. నటిస్తా గానీ నావి కొన్ని కండీషన్స్.. అని పేర్కొంటూ ఆ నిర్మాతకు దిమ్మతిరిగే కండీషన్స్ పెట్టిందట సన్నీ. దీంతో ఆ కండిషన్స్ చూసి మైండ్ బ్లాంక్ అయిన ఆ నిర్మాత సైలెంట్ గా వెనక్కి వచ్చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాపిక్ ఫిలింనగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
పోర్న్ స్టార్‌గా అశేష పాపులారిటీ సంపాదించిన సన్నీలియోన్.. ఆ తర్వాత పోర్న్ సినిమాలు వదిలేసి వెండితెర బాట పట్టింది. ఆమె అందానికి ఫిదా అయిన బాలీవుడ్ ఇండస్ట్రీ ఆమెకు వరుస అవకాశాలు ఇచ్చింది. అలా అలా టాలీవుడ్ వైపు చూసిన ఈ సెక్సీ స్టార్ మంచు మనోజ్ హీరోగా నటించిన 'కరెంట్ తీగ' లో నటించి మెప్పించింది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన 'గరుడ వేగ' సినిమాలో డియ్యో డియ్యో అంటూ ఐటెం సాంగ్ కే కొత్త వన్నె తెస్తూ ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసింది. దీంతో సన్నీకి తెలుగులోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ మేరకు ఆమె డేట్స్ కోసం దర్శకనిర్మాతలు వెయిట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రీసెంట్‌గా సన్నీలియోన్‌ను సంప్రదించిన ఓ నిర్మాత పట్టపగలే చుక్కలు చూశాడట. సన్నీలియోన్ పెట్టిన కండీషన్స్ తో ఆయనకు ముచ్చెమటలు పట్టాయట. తాను ఏదైనా సినిమాకి సంతకం చేయాలి అంటే ముందుగా సదరు దర్శకనిర్మాతలు బౌండెడ్ స్క్రిప్ట్‌తో రావాలని ఆమె చెప్పడంతో షాకయ్యాడట సదరు నిర్మాత. అంతేకాదు సెట్స్‌పై దర్శకనిర్మాతలు క్రమశిక్షణతో మెలగాలి అంటూ పెద్ద కండీషన్ పెట్టిందట సన్నీ. ఈ విషయం బయటకు రావడంతో స్టార్ హీరోయిన్సే నోరెళ్ల బెడుతున్నారట.