సన్నీలియోన్‌ని వెంటాడుతున్న వ్యాధి.. మాటలు పడుతూనే.. ప్రతీ పావుగంటకు ఒకసారి
Recommended Video
పోర్న్‌స్టార్‌గా బాగా పాపులర్ అయిన సన్నీలియోన్ ఆ తర్వాతి కాలంలో బాలీవుడ్ లోకి ప్రవేశించింది. శృంగార తారగా తనపై పడిన ముద్రను చెరిపేస్తూ వరుస సినిమాల్లో నటిస్తోంది. మెల్లగా టాలీవుడ్ తెరపై కూడా స్థానం సంపాదించిన ఈ సెక్సీస్టార్ మంచు మనోజ్ హీరోగా నటించిన 'కరెంట్ తీగ' లో నటించి మెప్పించింది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన 'గరుడ వేగ' సినిమాలో డియ్యో డియ్యో అంటూ ఐటెం సాంగ్‌కే కొత్త వన్నె తెస్తూ ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసింది. అయితే సాధారణ జనం లాగే సన్నీలియోన్ కూడా కొన్ని సమస్యలతో ఇబ్బంది పెడుతోందట. ఆ వివరాలు చూస్తే..

సన్నీలియోన్‌ని వెంటాడుతున్న వ్యాధి
బాలీవుడ్, టాలీవుడ్ తెరలపై కనువిందు చేస్తూ ప్రేక్షకలోకాన్ని ఉర్రూతలూగిస్తున్న సన్నీలియోన్ జీవితంలో చాలా సమస్యలున్నాయని తెలుస్తోంది. ఓ రకమైన మానసిక వ్యాధితో సన్నీలియోన్ చాలాకాలంగా సతమతమవుతోందట. రోజు రోజుకూ తీవ్రతరమవుతున్న ఆ వ్యాధి కారణంగా సన్నీలియోన్ కి అనుకోని కష్టాలు వస్తున్నాయని అంటున్నారు.

ప్రతీ పావుగంటకు ఒకసారి గ్యారెంటీగా
సెక్సీస్టార్ సన్నీలియోన్ ప్రతీ పావుగంటకు ఒకసారి గ్యారెంటీగా కాళ్ళు, చేతులు, ముఖం వాష్ చేసుకుంటూ ఉంటుందట. చాలా కాలంగా ఆమెకిది ఓ అలవాటుగా మారడం వల్ల దాన్నుంచి బయటకు రాలేకపోతోందట సన్నీ. అయితే ఈ కారణంగా సన్నీకి లేనిపోని ఇబ్బందులు కూడా వస్తున్నాయని సమాచారం.

షూటింగ్ కి ఆలస్యం.. మాటలు పడక తప్పటం లేదు
సన్నీలియోన్ ని వెంటాడుతున్న ఈ మానసిక రుగ్మత వల్ల ప్రతీసారి ఆమె షూటింగ్ స్పాట్‌కి ఆలస్యంగానే చేరుకుంటోందట. ఈ కారణంగా ఆమెకు చిత్రయూనిట్ నుంచి చీవాట్లు తప్పడం లేదని తెలుస్తోంది. అయితే ఈ మానసిక వ్యాధి నుంచి బటయపడాలని ఎంత ప్రయత్నించినా తన వల్ల కావడం లేదని సన్నిహితులతో చెప్పుకుంటోంది సన్నీ.

తగ్గేదే లేదన్నట్లుగా ఫుల్ డిమాండ్
ఎన్ని మానసిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా తగ్గేదే లేదన్నట్లుగా సినిమా అవకాశాలు పట్టేస్తూ దూసుకుపోతోంది సన్నీ. తాను ఏదైనా సినిమాకి సంతకం చేయాలి అంటే ముందుగా సదరు దర్శకనిర్మాతలు బౌండెడ్ స్క్రిప్ట్‌తో రావాలని డిమాండ్ చేస్తోంది సన్నీలియోన్. సెట్స్ పై తనను నొప్పించేలా ఎవ్వరు బెహేవ్ చేయద్దనేది సన్నీ మరో డిమాండ్.


Click it and Unblock the Notifications











