టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సన్నీలియోన్
హైదరాబాద్: ఇండో కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఇప్పటికే బాలీవుడ్లో పలు సినిమాల్లో కనిపించి తన గ్లామర్ పెర్ఫార్మెన్స్‌తో శృంగార ప్రియులను బోల్డ్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలో సన్నీ లియోన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మేరకు ఓ నిర్మాతకు కమిట్‌మెంటు కూడా ఇచ్చిందట.
చెన్నై సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తమిళ నిర్మాత కైజద్ గుస్తాద్ ఆమెతో ఓ ద్విబాషా చిత్రం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడని, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న భరత్ ఈచిత్రంలో హీరోగా నటించబోతున్నాడని, ప్రస్తుతం ఈ చిత్రానికి '555' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. సన్నీ లియోన్ సినిమా అనగానే శృంగార ప్రియుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది.
కెనియన్ ఫోర్న్ స్టార్ అయిన సన్నీ లియోన్ బాలీవుడ్‌కి రాకముందు పలు నీలి చిత్రాల్లో నటించడమే కాదు, ఆ సినిమా విభాగంలో పెద్ద స్టార్‌గా పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన సన్నీ లియోన్ అప్పటి నుంచి బూతు సినిమాలకు దూరంగా ఉంటూ భారతీయ సినిమా రంగంలో తన అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం చేస్తోంది.


Click it and Unblock the Notifications












