For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘సర్కారు వారి పాట’ టీజర్ హైలైట్స్ లీక్: మహేశ్ నుంచి ఇది ఊహించరు.. ఆ ఒక్క దానితో పూనకాలు ఖాయం!

  |

  సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చిన్న వయసులోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించి, ఆ తర్వాత హీరోగా మారిన అతడు.. ఎన్నో సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకున్నాడు.

  ఇక, ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతోన్న ఈ హ్యాండ్సమ్ హీరో.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాలను చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే మూవీ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అప్‌డేట్ ఆగస్టు 9న రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అందులోని హైలైట్లు బయటకు వచ్చాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  హ్యాట్రిక్ విజయాలతో మహేశ్ దూకుడు

  హ్యాట్రిక్ విజయాలతో మహేశ్ దూకుడు

  ఆ మధ్య భారీ డిజాస్టర్ చిత్రాలతో అభిమానులను నిరాశ పరిచాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇలాంటి పరిస్థితుల్లో బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ‘భరత్ అనే నేను' సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే వంశీ పైడిపల్లితో ‘మహర్షి', ఆ తర్వాత అనిల్ రావిపూడితో ‘సరిలేరు నీకెవ్వరు' వంటి చిత్రాలు చేసి వరుస హిట్లను అందుకున్నాడు. ఈ మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో అతడి ఖాతాలో విజయాల హ్యాట్రిక్ వచ్చి చేరింది.

  టాలీవుడ్ ఐటెం గర్ల్ గ్లామరస్ ఫొటోలు: లేటు వయసులోనూ ఘాటుగా.. ఇంటర్నెట్‌ను షేక్ చేసిన పిక్స్ ఇవే!

  సర్కారు వారి పాట అంటున్న మహేశ్

  సర్కారు వారి పాట అంటున్న మహేశ్

  హిట్లు మీద హిట్లు కొడుతూ సూపర్ డూపర్ ఫామ్‌లో ఉన్నాడు మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు ‘సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది.

  ఎప్పుడో అనుకుంటే.. వరుస బ్రేకులతో

  ఎప్పుడో అనుకుంటే.. వరుస బ్రేకులతో

  అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మహేశ్ బాబు.. వంశీ పైడిపల్లితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ అనివార్య కారణాలతో అది పట్టాలెక్కలేదు. ఆ వెంటనే పరశురాంతో ‘సర్కారు వారి పాట' చేస్తున్నట్లు ప్రకటించాడు. అప్పుడు కరోనా ప్రభావంతో ఇది వెంటనే ప్రారంభం కాలేదు. ఇక, ఈ ఏడాది ఆరంభంలో ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. మళ్లీ గ్యాప్ వచ్చి ఇటీవలే రెండో మొదలైంది. అప్పటి నుంచి షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

  బిగ్ బాస్ నుంచి మరికొన్ని లీకులు: హౌస్‌లో ఇప్పుడు జరిగేది ఇదే.. కొద్ది రోజుల్లోనే బిగ్ సర్‌ప్రైజ్

  సినిమా కథ ఇదే.. అన్నీ ఉండేలా ప్లాన్

  సినిమా కథ ఇదే.. అన్నీ ఉండేలా ప్లాన్

  సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న ‘సర్కారు వారి పాట' మూవీ బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ విమర్శనాత్మకంగా రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా హీరో తండ్రైన బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన విలన్.. విదేశాలకు పారిపోతాడు. అప్పుడు హీరో.. తన తండ్రి నిజాయితీని నిరూపించేందుకు విలన్‌ను ఎలా పట్టించాడనేదే ఈ మూవీ కథ అంటున్నారు. ఇక, ఈ సినిమా అన్ని హంగులతో కలిసి ఉంటుందని తెలుస్తోంది.

  పర్‌ఫెక్ట్ ప్లాన్‌తో ముందుకు వెళ్తోన్నాడు

  పర్‌ఫెక్ట్ ప్లాన్‌తో ముందుకు వెళ్తోన్నాడు

  వాస్తవానికి ‘సర్కారు వారి పాట' షూటింగ్ రెండో షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం పరిస్థితుల వల్ల భారతీయులకు ఆయా దేశాల్లో ప్రవేశం లేదు. దీంతో ఈ మూవీ షూటింగ్‌లో మార్పులు చేసి ఇక్కడే చిత్రీకరణ జరపాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఈ మూవీ సెకెండ్ షెడ్యూల్‌ను ప్రారంభించారు. దీన్ని సెప్టెంబర్ చివరికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇది పూర్తైన వెంటనే మహేశ్.. త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కంచేందుకు ప్లాన్లు చేసుకుంటున్నాడు.

  పోస్టర్‌తోనే రికార్డులు బద్దలు కొట్టేశారు

  పోస్టర్‌తోనే రికార్డులు బద్దలు కొట్టేశారు

  సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్లంతా కలిసి కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అతడి పుట్టినరోజున రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను మొదలెట్టిన మహేశ్ ఫ్యాన్స్.. ఇటీవల వచ్చిన ‘సర్కారు వారి పాట' ఫస్ట్ నోటీస్ పోస్టర్‌కు భారీ రెస్పాన్స్ అందించారు. ఫలితంగా ఇది ఎక్కువ మంది లైక్, రీట్వీట్ చేసిన పోస్టర్‌గా చరిత్రను సృష్టించింది.

  భర్తతో ప్రియాంక రొమాంటిక్ పిక్: ఇది అతడి సొంతమైన పార్ట్ అంటూ.. అక్కడ హత్తుకున్న హీరోయిన్

   సూపర్ స్టార్ బర్త్‌డే బ్లాస్టర్ రాబోతుంది

  సూపర్ స్టార్ బర్త్‌డే బ్లాస్టర్ రాబోతుంది

  ‘సర్కారు వారి పాట' సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ఇటీవలే ప్రకటించిన చిత్ర యూనిట్.. ఓ అదిరిపోయే పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. అదే సమయంలో మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ‘సూపర్ స్టార్ బర్త్‌డే బ్లాస్టర్' అనే పేరిట ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఇక, ఇది ఆ సినిమాకు సంబంధించిన టీజరే అని అంతా అనుకుంటున్నారు. దీంతో ఈ సర్‌ప్రైజ్ కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  Vihari tweets about Pspk rana movie | Filmibeat Telugu
  ‘సర్కారు వారి పాట' టీజర్ హైలైట్స్ లీక్

  ‘సర్కారు వారి పాట' టీజర్ హైలైట్స్ లీక్

  ‘సర్కారు వారి పాట' నుంచి ఆగస్టు 9న రాబోయే ‘సూపర్ స్టార్ బర్త్‌డే బ్లాస్టర్' హైలైట్లు తాజాగా లీకయ్యాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇది టీజరే అని తెలిసింది. ఈ వీడియో దాదాపు నిమిషం పైగానే నిడివితో కట్ చేశారని తెలిసింది. అలాగే, ఇందులో థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా ఉండబోతుందట. ఇక, చివర్లో మహేశ్ బాబు నోటి వెంట వచ్చే ఒక డైలాగ్ ఫ్యాన్స్‌తో అరుపులు పెట్టిస్తుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మోత మోగించేందుకు మహేశ్ సిద్ధం అవుతున్నాడన్న మాట.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Mahesh Babu Now Doing Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. Now This Movie Super Star Birthday BLASTER Highlights Leaked.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X