అల్లు అరవింద్ మెగా ప్లాన్.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ చిత్రం!
మహేష్ బాబుతో సినిమా చేయాలని చాలా మంది బడా నిర్మాతలు కోరుకుంటారు. మహేష్ కు ఉండే క్రేజ్ తో సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్ కు కాసుల వర్షమే. అల్లు అరవింద్ నిర్మాతగా అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. అల్లు అరవింద్ కు భారీ చిత్రాలని నిర్మించే స్థాయి ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అదే ఆయన సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేతులు కలిపితే నిజంగా ఆశ్చర్యకరమే. ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అల్లు అరవింద్ ఎక్కువగా మెగా కాంపౌండ్ లోనే చిత్రాలని నిర్మించారు. అలాంటిది ఇలా మహేష్ తో సినిమా అంటే సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. ఇటీవల అల్లు అరవింద్ మహేష్ బాబుని కలసి తన ప్రతిపాదన తీసుకువచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు కూడా పాజిటివ్ గానే స్పందించాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Recommended Video

అల్లు అరవింద్, మహేష్ బాబు కాంబోలో సినిమాకు తొలి అడుగు పడ్డట్లే అని చిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుంది, దర్శకుడు ఎవరు వంటి విషయాల్లో క్లారిటీ రావలసి ఉంది. ఈ ప్రాజెక్టు ఓకే అయితే మాత్రం కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని అంటున్నారు. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని బడ్జెట్ కు వెనుకాడకుండా నిర్మించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











