మహేష్‌బాబు బాలీవుడ్ ఎంట్రీ.. ప్యాన్ ఇండియా డైరెక్టర్‌తో.. ఫ్యాన్స్ కేక పెట్టే న్యూస్.!

టాలీవుడ్ హీరోలలో ప్రభాస్, రాంచరణ్ ఇప్పటికే బాలీవుడ్‌లో తమ అద‌ృష్టాన్ని పరీక్షించుకొన్నారు. ఇక మిగిలింది జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు మాత్రం మిగిలి ఉన్నారు. అయితే మహేష్ తన బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో ఊరిస్తు ఉన్నారు. అయితే ఈ మధ్య వచ్చిన స్పైడర్ హిట్ అయి ఉంటే ఆ ప్రయత్నం చేసేవారనే మాట వినిపించింది. అయితే దక్షిణాదిలోనే ఆకట్టుకోలేకపోయడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకొన్నాడని సినీ వర్గాలు చెప్పుకొంటాయి. అయితే తాజా తన అభిమానులను ఆనందానికి గురిచేసే నిర్ణయం తీసుకొన్నాడనే విషయం వైరల్ అయింది. రాబోయే తన సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..

సరిలేరు నీకెవ్వరు తర్వాత

సరిలేరు నీకెవ్వరు తర్వాత

సూపర్‌స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాను ఓ పక్క పరుగులు పెట్టిస్తూనే తన 27వ చిత్రానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. కేజీఎఫ్‌తో ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకొన్న కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమాను ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర షూటింగ్‌ను మే 2020 నుంచి ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడనేది తాజా సమాచారం.

మూడు నెలలు వెకేషన్

మూడు నెలలు వెకేషన్

అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత జనవరిలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మూడు నెలలు ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్‌కు వెళ్తున్నామని మహేష్ సతీమణి నమత్ర ఇటీవల మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంటే మూడు నెలల గ్యాప్ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా కోసం సిద్ధమయ్యే కార్యాచరణను పెట్టుకొన్నారనేది తాజా సమాచారం.

మహేష్ 27 మూవీలో కొత్త గెటప్

మహేష్ 27 మూవీలో కొత్త గెటప్

ఇక ప్రశాంత్ నీల్‌ సినిమాకు కోసం సరికొత్త గెటప్‌లో మహేష్ కనిపిస్తారట. ఇప్పటి వరకు చూడని కొత్త లుక్ కోసం మూడు నెలల గ్యాప్ తీసుకొంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే పిల్లలతో కలిసి వెకేషన్స్ ప్లాన్ చేశారని.. విహార యాత్ర నుంచి రాగానే కొత్త లుక్‌తో షూటింగ్ హాజరయ్యేలా చర్యలు తీసుకొంటున్నారని తెలిసింది.

ప్రశాంత్ నీల్‌తో ప్యాన్ ఇండియా మూవీ

ప్రశాంత్ నీల్‌తో ప్యాన్ ఇండియా మూవీ

ఇక ప్రశాంత్ నీల్‌తో వచ్చే సినిమాతో మహేష్ డేరింగ్ నిర్ణయం తీసుకొన్నాడు. కేజీఎఫ్‌తో ప్రశాంత్ నీల్‌కు దేశవ్యాప్తంగా ప్రేక్షకదారణ రావడం, అలాగే మహేష్‌కు ప్యాన్ ఇండియా ఇమేజ్ కూడా ఉండటంతో బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నారట. అంతేకాకుండా ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే నమ్రత తన ప్లానింగ్‌ను మొదలుపెట్టినట్టు సమాచారం.

నెలాఖరుకు సరిలేరు నీకెవ్వరు టీజర్

నెలాఖరుకు సరిలేరు నీకెవ్వరు టీజర్

ఇలా తన 27వ సినిమాను పక్కాగా ప్లాన్ చేసుకొంటూనే సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సంక్రాంతి బరిలో దిగుతున్నారు. ఇక అభిమానులను సంతోషంలో నింపడానికి టీజర్‌ను సిద్దం చేసే పనిలో ఉన్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రం టీజర్‌ను నవంబర్ చివరి వారంలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X