ఎయిర్ పోర్టులో 5 గంటల నిరీక్షణ.. ఓపిక నశించి ఇంటికి వెళ్లిపోయిన మహేష్ బాబు!

Recommended Video

Mahesh Babu Got Rare Experience At Shamshabad Airport | Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం మహర్షి చిత్రం అనుకున్న సమయానికి విడుదల కావడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రీకరణ ఇంకా చాలా భాగం జరుగుతుండడంతో ఆసల్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా మహర్షి షూటింగ్ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో మహేష్ కు చేదు అనుభవం ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి.

విమానాశ్రయానికి హైజాక్ బెదిరింపులు

విమానాశ్రయానికి హైజాక్ బెదిరింపులు

ఆదివారం రోజు హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి హైజాక్ బెదిరింపులు వచ్చాయి. దీనితో రోజు మొత్తం పోలీసులు, ఎయిర్పోర్ట్ అధికారులు హైఅలర్ట్ నిర్వహించారు. విమానాశ్రయంలో చాలా కార్యక్రమాలు, విమానాలు రద్దయ్యాయి. ఈ సమయంలో మహర్షి చిత్ర యూనిట్ కు, ముఖ్యంగా మహేష్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది.

ఐదు గంటలపాటు

ఐదు గంటలపాటు

విమానాశ్రయంలో కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు మహర్షి టీం కొన్ని రోజుల క్రితమే అనుమతి తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం మహేష్ బాబు ఆదివారం రోజు ఉదయమే 7:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళాడు. కానీ విమానాశ్రయం అధికారులు హైఅలర్ట్ ప్రకటించి ఉన్న నేపథ్యంలో మహర్షి చిత్ర యూనిట్ ని లోపలి అనుమతించలేదు. దీనితో మహేష్ బాబు క్యారవాన్ లో చాలా సమయం ఎదురుచూశారట. షూటింగ్ కోసం చిత్ర యూనిట్ అధికారులతో సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోయింది. మహేష్ బాబు దాదాపు 5 గంటల పాటు క్యారవాన్ లోనే ఎదురుచూశాడట.

ఓపిక నశించి

ఓపిక నశించి

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ కు అనుమతి ఇవ్వలేం అని అధికారులు మహర్షి టీంకు తేల్చి చెప్పారు. మహేష్ బాబు కూడా తనకు ఓపిక నశించడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇలా మహర్షి టీం షెడ్యూల్ లో ఒక రోజు వృధా అయింది. మహేష్ బాబు ఈ చిత్రంలో బడా కార్పొరేట్ సంస్థ సీఈవో పాత్రలో నటిస్తున్నాడు. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ప్రధానంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

కీలక పాత్రలో అల్లరి నరేష్

కీలక పాత్రలో అల్లరి నరేష్

హీరో అల్లరి నరేష్ ఈ చిత్రంలో మహేష్ బాబు స్నేహితుడిగా కీలక పాత్రలో నటిస్తున్నాడు. పూజ హెగ్డే మహేష్ సరసన తొలిసారి హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయాలని భావించారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X