Mahesh Babu Trending: ఏంటీ భయ్యా ఇది.. మహేశ్​కు కూడా ఇలా బొగ్గు పూశారేంటి?

కేజీఎఫ్ సిరీస్ లతో హోంబలే ఫిలిమ్స్ సంస్థకు ఒక్కసారిగా దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ప్రశాంత్ నీల్, హోంబలే ఫిలిమ్స్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు, రాబోతున్న సినిమాలకు ఓ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఈ కాంబినేషన్లో ప్రభాస్ సలార్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై మహేశ్ బాబు తన 30వ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ ఓ ఫేక్ న్యూస్ అవుతోంది. అయితే ఆ పూర్తి వివరాల్లోకి వెళితే....

ఎలివేషన్స్ కా బాప్: కేజీఎఫ్‌ సిరీస్ సినిమాలతో ఎలివేషన్‌ కింగ్‌ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌... తర్వాతి సినిమా ప్రభాస్ తో సలార్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కాగా... సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో సలార్ టీజర్ ట్రెండింగ్లో ఉంది. ఆయన ఇచ్చిన ఎలివేషన్స్ ఓ రేంజులో ఉన్నాయి. ప్రభాస్ పూర్తిగా కనిపించకపోయినా... సూపర్ రెస్పాన్స్ అయితే వస్తోంది.

Super Star Mahesh Babu is doing a movie in Hombale Films goes fake news viral in social media

కామన్ పాయింట్ ఇదే: అయితే ప్రశాంత్ నీల్ హోంబలే కాంబినేషన్లో ఎన్టీఆర్ సినిమా కూడా ఉందని ఆ మధ్య ప్రకటించారు. ఎన్టీఆర్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సంస్థలోని సినిమాలకు కామన్ పాయింట్ ఒక్కటే. బ్లాక్ కలర్లో పోస్టర్స్ ఉంటాయి. అంతే కాదు హీరోకు బొగ్గు పూసినట్లు ఉంటుంది. పోస్టర్స్ లో గమనిస్తే.. బొగ్గు నేపథ్యం కనిపిస్తుంది. అయితే కేజీఎఫ్, సలార్, రాబోయే ఎన్టీఆర్ సినిమా ఇవన్నీ టింట్ కలర్ లోనే ఉంటాయి.

మహేశ్ ఫోటో వైరల్: అయితే మహేశ్ బాబు తన 30వ సినిమా హోంబలే ఫిలిమ్స్ సంస్థలో చేస్తున్నట్లు ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హోంబలే ఫిలిమ్స్ ఫేక్ ట్విట్టర్ నుంచి.. మహేశ్ బాబు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఇది ఫేక్ న్యూస్ అని తేలింది. ఇక ఈ పోస్టర్ గమనిస్తే... మహేశ్ బాబుకు కూడా బొగ్గు పూశారు. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Super Star Mahesh Babu is doing a movie in Hombale Films goes fake news viral in social media

మిల్కీ బాయ్ ను.. బొగ్గుగా: మహేశ్ బాబు అంటే... క్యూట్ లుక్స్, హ్యాండ్సమ్ గా ఉంటారు. మిల్కి బాయ్ లా ఉండే మహేశ్ బాబుకు బొగ్గు పూసేశారు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారింది. ఆఖరికి మహేశ్ బాబుకు బొగ్గు పూశారేంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటో వైరల్ చేసింది ఎవరూ ఎందుకు చేశారో తెలియదు. అయితే హోంబలే ఫిలిమ్స్లో మహేశ్ సినిమా చేస్తే బాగుంటుందని కొంతమంది ఇలా చేశారని అంటున్నారు.

Super Star Mahesh Babu is doing a movie in Hombale Films goes fake news viral in social media

పాన్ వరల్డ్ మూవీలో: ఇక మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేశ్.. రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు మొదలు అయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమా హాలీవుడ్ రేంజులో ఉంటుందని అప్పుడే అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా పూర్తి అయ్యే సరికి దాదాపు 5 ఏళ్లు పడుతుందని అంటున్నారు. చూడాలి ఇక.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X