రజినీకాంత్ బయోపిక్.. ఎవరు చేయబోతున్నారో తెలుసా?
ఒక సాధారణ కండక్టర్ నుంచి వెండితెర సూపర్ స్టార్ వరకు ఎదిగిన కోలీవుడ్ హీరో రజినీకాంత్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. నిజజీవితంలో ఆయన జీవితం అందరికి ఎంతగానో స్ఫూర్తినిస్తోంది. దేశ విదేశాల్లో కూడా అభిమానులను సంపాదించుకున్న తలైవా బయోపిక్ పై ప్రస్తుతం ఒక న్యూస్ వైరల్ గా మారింది. సూపర్ స్టార్ బాల్యం దశ నుంచి ఆయన సూపర్ స్టార్ గా ఎలా ఎదిగారు అనే విషయాలను సినిమా ద్వారా చూపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ పాత్రలో ధనుష్ కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ బయోపిక్ పై గత ఐదారేళ్లుగా కోలీవుడ్ లో అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక ఇటీవల దర్శకుడు లింగుస్వామి ఆ బయోపిక్ కోసం బ్యాక్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇంతకుముందు ఈ దర్శకుడు పందెంకోడి, అవారా సినిమాలతో తెలుగులో కూడా బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. మొన్న పందెంకోడి సీక్వెల్ తో హిట్ కొట్టాలని ట్రై చేశాడు గాని వర్కౌట్ కాలేదు.

ఇక ఫైనల్ గా లింగుస్వామి రజినీకాంత్ బయోపిక్ తో ఇప్పుడు మరో భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇక రజినీకాంత్ ఎంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో తెలియదు గాని ధనుష్ మాత్రం మామయ్య పాత్రలో నటించడానికి రెడీ అంటున్నాడు.
మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక రజినీకాంత్ ప్రస్తుతం కారోన్ వైరస్ కారణంగా బయటకు వెళ్లడం లేదు. శివ దర్శకత్వంలో చేయనున్న సినిమాను కూడా రిస్క్ చేయలేక స్టార్ట్ చేయడం లేదు. దీంతో దర్శకుడు వేరే సీన్స్ ని ఫినిష్ చేసే పనిలో బిజీ అయ్యాడు. పరిస్థితులు అదుపులోకి వచ్చిన అనంతరం తలైవా ఆ టీమ్ తో కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











