రాజమౌళి క్రేజ్ ఎంతంటే ఐయస్ఐ మార్క్ అంత..!?
ఒక డైరెక్టర్ కి హీరోలతో సమానంగా స్టార్ డమ్ రావడమనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. కేవలం తన పేరుతోనే కోట్ల బిజినెస్ చేయగల ఏకైక తెలుగు దర్శకుడు రాజమౌళి అంటే అతిశయోక్తి కాదేమో.. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమని శాసిస్తున్న ఈ దర్శకుడితో గతంలో పూరిజగన్నాథ్, వివి వినాయక్ లాంటి కొందరు డైరెక్టర్స్ పోటీ పడేవారు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత.
కానీ మగధీర తర్వాత రాజమౌళి రేంజ్ అమాంతం రెట్టింపయింది. మిగతా వారికి అందనంత ఎత్తులో అతను నిలిచాడు. రాజమౌళి రేంజ్ కి ఉదాహరణ కావాలంటే అతని ట్విట్టర్ ఫాలోవర్స్ కౌంట్ ని చూస్తే తెలుస్తుంది. లక్షమందికి పైగా ఫాలోవర్స్ ఉన్న ఏకైక సౌత్ ఇండియన్ డైరెక్టర్ (టెక్నీషియన్) అతను. ఈ అరుదైన ఘనత సాధించిన రాజమౌళి దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు..
కానీ పెద్ద స్టార్స్ కి తప్ప సాధ్యం కాని దానిని రాజమౌళి సాధించాడంటే అతనికి ప్రజల్లో ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే హీరో ఎవరనేది కూడా జనానికి అవసరంలేదు. పోస్టర్ పై రాజమౌళి ముద్ర కనిపించిందో ఐఎస్ఐ ముద్ర చూసినట్టు సినిమా బాగుంటుందనే ఖచ్చిమైన నమ్మకంతో థియేటర్స్ కి వచ్చేస్తారు. ఆ నమ్మకం రాబట్టుకోవడం కాదు, దానిని నిలబెట్టుకోవడంలోనే రాజమౌళి గొప్పతనం కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











