అల్లు అర్జున్ సినిమాలో టన్నెల్ ఫైట్..ఇంటర్వెల్ కు ముందు, అంచనాలు ఒక్కసారిగా !
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం నాపేరు సూర్య. మిలటరీ, దేశభక్తి నేపథ్యంలో ఈ చ్చిత్రం తెరకెక్కుతోంది. తొలిసారి దర్శకుడుగా మారుతున్న రచయిత వక్కంతం వంశి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రం బన్నీ కెరీర్ లోనే భారీ యాక్షన్ చిత్రంగా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ఇంపాక్ట్ అభిమానుల్లో ఓ రేంజ్ లో అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. ఆర్మీ ఆఫీసర్ గా బన్నీ చెలరేగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ చిత్ర ఇంటర్వెల్ సన్నివేశం గురించి ఆసక్తి కరమైన వార్తలు వస్తున్నాయి.
Recommended Video


స్టైలిష్ మేకోవర్
అల్లు అర్జున్ ఈ చిత్రం కోసం స్టలిష్ మేకోవర్ లో కనిపిస్తున్నాడు. ఆర్మీ మాన్ గా పర్ఫెక్ట్ గా ఉఉన్నదని అభిమానులు అంటున్నారు.

పగిలిపోయిన ఫస్ట్ ఇంపాక్ట్
ఫస్ట్ ఇంపాక్ట్ పేరుతో నాపేరు సూర్య చిత్ర యూనిట్ ఓ టీజర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీజర్ తోనే దర్శకుడు వక్కంతం వంశి అంచనాలు అమాంతం పెంచేశాడు.

హాలీవుడ్ రేంజ్ లో ఇంటర్వెల్ సన్నివేశం
ఈ చిత్రంలో ఇంటర్వెల్ సన్నివేశాన్ని హాలీవుడ్ రేంజ్ ఓ చిత్రీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

భారీ టన్నెల్ ఫైట్
ఈ చిత్ర ఇంటర్వెల్ ముందు అదిరిపోయే టన్నెల్ ఫైట్ ని సిద్దం చేశారట. ఆ ఫైట్ తో అభిమానులు ఆశ్చర్యపోవడం ఖాయం అని లీకులు వస్తున్నాయి.

అన్నపూర్ణ స్టూడియోస్ లో
టన్నెల్ ఫైట్ కోసం అన్నపూర్ణ స్టూడియో లో భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది. అది సెట్ అయినప్పటికీ సహజమైన టన్నెల్ అనే ఫీలింగ్ ఇచ్చేలా రూపొందించారట.మే 4 న నాపేరు సూర్య చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











