SS Rajamouli: మహేశ్ బాబు మామూలోడు కాదు.. జక్కన్న సెంటిమెంట్‌ను బ్రేక్ చేసేందుకు బిగ్ ప్లాన్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళితో సినిమాలు తీసే హీరోలకు రాజమౌళి సినిమా హిట్ అయినప్పటికీ... ఆ తర్వాతి సినిమా మాత్రం ప్లాప్ అవుతూ వస్తుంది. అయితే రాజమౌళి సినిమా తర్వాత సినిమా ప్లాప్ అవ్వకుండా మహేశ్ పెద్ద ప్లాన్ వేశాడు అని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
మహేశ్ బాబు క్రేజ్ అంటే మామూలుగా ఉండదు. ఆయన సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక గుంటూరు సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు ఓ సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమాపై అప్పుడే అంచనాలు మొదలు అయ్యాయి. ఈ మూవీ స్క్రీప్ట్ కూడా రెడీ అయిందని తెలుస్తోంది. ఇక రాజమౌళి కూడా ఈ సినిమాపై వర్క్ మొదలు పెట్టారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా పూర్తి కాక ముందే మహేశ్ బాబు నెక్ట్స్ మూవీ అప్డేట్ వచ్చింది. ఒక న్యూస్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
రాజమౌళి దర్శకత్వంలో ఏ హీరో చేసినా.. తన నెక్ట్స్ మూవీ ప్లాప్ అవుతూ వస్తుంది. ఎన్టీఆర్ సినిమా నుంచి.. మొన్నటి రామ్ చరణ్ వరకు ఈ ప్లాప్ సెంటిమెంట్ అవుతూనే ఉంది. మరి మహేశ్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తే.. మరి నెక్ట్స్ మూవీ ప్లాప్ అవుతుందని అంతా అనుకున్నట్లే మహేశ్ బాబు కూడా అనుకున్నారు. దీని కోసం.. మహేశ్ బాబు ఓ బిగ్ స్కేచ్ వేశాడు.

రాజమౌళి సినిమా అయిపోయిన తర్వాత మహేష్ బాబు ఏ డైరెక్టర్ తో చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సింగిల్ గా కాకుండా ఈ సినిమాను బిగ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిస్తే ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయొచ్చని మహేశ్ బాబు అనుకుంటున్నారని తెలుస్తోంది. కేవలం సినిమాలో ఆ హీరో ఒక్కరే ఉండడు.. మహేష్ బాబు తో పాటు మిగతా హీరోలు కూడా ఉంటారని టాక్.

అలా సెంటిమెంట్ రిపీట్ అయిన తన వరకు ఫ్లాప్ రాదు. అలా రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నారని నెట్టింట్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ ప్లాన్ తెలుసుకున్న నెటిజన్స్.. భలే ప్లాన్ వేశాడు మహేశ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.


Click it and Unblock the Notifications











