మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడు... ఇప్పుడు థియేటర్ లో దుమ్మేలేపుతోంది.! ఆ మూవీ ఏంటో తెలుసా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎస్ఎస్ఎంబీ29 అని ప్రాజెక్ట్ కు వర్కింగ్ టైటిల్ ను కూడా అనౌన్స్ చేసిన టీమ్ ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉంది. జక్కన్న, మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా సెట్స్ లో హాజరై ఉంటున్నారు. మహేశ్ బాబు చివరిగా 'గుంటూరు కారం'తో మంచి హిట్ అందుకున్నారు. నెక్ట్స్ రాజమౌళి ప్రాజెక్ట్ తో అలరించబోతున్నారు. అయితే.. బాబు ఒప్పుకుంటే ప్రజెంట్ ఒక బ్లాక్ బాస్టర్ మూవీ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేది.

మహేశ్ బాబు అభిమానులకు బాబును డిఫరెంట్ రోల్స్ లో చూడాలనే కోరిక సహజంగానే ఉంటుంది. అలాంటింది వీరుల పాత్రల్లో మహేశ్ బాబును చూడటానికి అభిమానులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ మహేశ్ బాబు రిజెక్ట్ చేయడంతో ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు మిస్ అయిపోయింది. మహేశ్ బాబు చేయాల్సిన సినిమా బాలీవుడ్ స్టార్ హీరోకు వెళ్లింది. ఇఫ్పుడు ఆ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. హిందీలో భాషలో ఫిబ్రవరి 14న థియేటర్లో గ్రాండ్ గా విడుదలైన నఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తొలిరోజే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

Superstar Mahesh Babu Rejected a film Now It is Running in Theaters Successfully Here is details

శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ 'ఛావా' ప్రస్తుతం థియేటర్లలో విడుదలై దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. ఇది కేవలం హిందీ భాషలోనే విడుదలైంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాత దినేష్ గ్రాండ్ గా నిర్మించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఛత్రపతి శంభాజీ మహారాజ్ భార్య ఏసుబాయ్ భోన్ల్సే పాత్రలో నటించింది. వారం రోజులు కూడా కాకుండానే ఈ చిత్రం రూ.234 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది.

అయితే.. ఛత్రపతి శివాజీ కొడకైనా శంభాజీ పాత్రతో సినిమా చేద్దామనుకున్నప్పుడు దర్శకనిర్మాతలు మహేశ్ బాబును సంప్రదించారంట. కథ విన్న మహేశ్ బాబు చాలా బాగుందని చెప్పారంట. తనకు ఎంతగానో కథ నచ్చిందని చెప్పారంట. కానీ ఎందుకో చేయలేదు. అయితే.. అప్పటికే ఎస్ఎస్ఎంబీ29కి సైన్ చేసిన మహేశ్ బాబు ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఈ పాత్రలో మహేశ్ బాబును చూస్తే మాత్రం అభిమానులకు ఫుల్ మీల్స్ కన్ఫమ్ అంటున్నారు.

Superstar Mahesh Babu Rejected a film Now It is Running in Theaters Successfully Here is details

అయితే.. 2006లోనే మహేశ్ బాబుకు శంభాజీ కథ వచ్చిందని తెలుస్తోంది. పరుచూరి బ్రదర్స్ నుంచి ఈ కథ విన్నారంట.. ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీలో సినిమా చేద్దామనే ప్లాన్ ఉండేనంట.. కానీ ఎందుకో వర్క్ అవ్వలేదు. ఏదేమైనా బాలీవుడ్ స్టార్, కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌషల్ కు 'ఛావా' మంచి విజయాన్ని సాధించి పెట్టింది. మరోవైపు రష్మికకూ బాలీవుడ్ చిత్రాల్లో ఈ సినిమా మరో మెట్టును ఎక్కింది. ఇక మహేశ్ బాబు ప్రస్తుతం SSMB29 చిత్రంలో నటిస్తున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ కొనసాగుతోంది. జక్కన్న ఎలాంటి లీక్స్ కు తావివ్వకుండా స్ట్రిక్ట్ రూల్స్ తో షూట్ జరుపుతున్నారు.

More from Filmibeat

Read more about: mahesh babu ssmb29
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X