Mahesh Babu: అల్లుడు కోసం మహేష్ బాబు సాహసం.. ఇది నిజమైతే థియేటర్లు దేవాలయాలే ?
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్ రాజమౌళితో చేస్తున్న 'SSMB29' సినిమా కోసం రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్లనుంది. అయితే.. ఈ మూవీ కంప్లీట్ అయి.. రిలీజ్ కావడానికి దాదాపు మూడు సంవత్సరాల సమయం పట్టేలా ఉంది. అప్పటి వరకు ఫ్యాన్ వెయిట్ చేయలా ? అని ఫీల్ అవుతున్న సమయంలో మహేష్ బాబు తన ఫ్యాన్స్ అదిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నరట. అదేంటంటే ఓ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ గెస్ట్ రూల్ కనిపించబోతున్నారట. ఇంతకీ ఇంట్రెస్టింగ్ విషయమేంటో ఓ లూక్కేయండి.
సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందు వచ్చారు. ఈ మూవీ హిట్టా.. పట్టా.. అనేది పక్కన బెడితే.. తన డ్యాన్స్, నటన, మాస్ ఫైట్స్ తో మహేష్ బాబు తన ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ లాంటి ట్రీట్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం మహేశ్ బాబు.. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న SSMB29' సినిమా కోసం సిద్దమవుతున్నారు. రాజమౌళి మూవీ లోకేషన్స్ కోసం వెతుకుతుంటే.. మహేష్ బాబు తన మేకోవర్ తో పాటూ ఫిజిక్ పై ఫోకస్ చేస్తున్నారు.

వచ్చే ఏడాది జనవరిలో SSMB29 సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నది. ఈ మూవీ పూర్తయి.. ప్రేక్షకుల ముందుకు దాదాపు మూడేండ్ల సమయం పట్టేలా ఉంది. అప్పటిదాకా మహేష్ బాబును బిగ్ స్క్రీన్ పై చూడటం కష్టమేననీ భావించారు. కానీ, మహేశ్ బాబు తన ఫ్యాన్స్ కు ఎంటర్టైన్ చేయడానికి.. 'SSMB29' కంటే ముందే మహేష్ మరో సినిమాలో కనిపించబోతున్నారు. అయితే హీరోగా కాకుండా తొలిసారి మహేష్ బాబు ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. అది కూడా శ్రీకృష్ణుడి పాత్రలో నటించబోతున్నారట.
ఇంతకీ ఆ మూవీ ఏంటని ఆలోచిస్తున్నారా..? ఆ మూవీ ఏంటో కాదు. తన అల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న 'దేవకీ నందన వాసుదేవ' అనే చిత్రంలో మహేష్ బాబు అతిధి పాత్రలో కనిపించబోతున్నారట. ఈ మూవీకి హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించగా.. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించనున్నారు. ఇందులో మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీని సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు.
మహేష్ బాబు అల్లుడు హీరోగా పరిచయం అవుతున్న దేవకీ నందన వాసుదేవ మూవీ క్లైమాక్స్ లో శ్రీకృష్ణునికి సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్నాయట. అయితే ఆ సన్నివేశాలలో మహేష్ బాబు నటిస్తే బాగుంటుందని మూవీ టీం అనుకున్నారట. ఈ మేరకు మహేష్ బాబును సంప్రదించగా అతడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే.. దేవకీ నందన వాసుదేవ సినిమా క్లైమాక్స్‌లో మహేష్ కృష్ణుడి అవతారంలో కనిపిస్తారన్నమాట.

అయితే.. ఇప్పటికే మహేశ్ బాబు కృష్ణుడి అవతారంలో నటించినట్టు ఇండ్రస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటూ ఇటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. ఈ వార్త తో మహేష్ ఫ్యాన్స్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. అశోక్ గల్లా హీరోగా నటిస్తోన్న 'దేవకీ నందన వాసుదేవ' చిత్రం నవంబర్ 14న రిలీజ్ కాబోతుంది. ఈ అప్డేట్ తో దేవకీ నందన వాసుదేవ సినిమాపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యాయి. నిజంగానే మహేష్ బాబు శ్రీకృష్ణునిడి కనిపిస్తే.. ఆ మూవీ నడిచే థియేటర్లన్నీ దేవాలయాలుగా మారిపోతాయి అనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. మహేష్ పై ఫ్యాన్స్ అభిమానం అలాంటి మరీ.


Click it and Unblock the Notifications











