SS Rajamouli Mahesh: ఆ హీరోయిన్‌పై కన్నేసిన మహేశ్ బాబు.. జక్కన్నకు స్పెషల్ రిక్వెస్ట్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. గుంటూరు కారం సంక్రాంతి కానుకగా వస్తున్నట్లు మహేశ్ స్వయంగా చెప్పుకువచ్చారు. ఇక ఆ విషయం పక్కన పెడితే.. మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమాలో ఓ హీరోయిన్ ను సజెస్ట్ చేశారట మహేశ్. ఆమె ఎవరు.. మహేశ్ బాబు స్పెషల్ గా ఎందుకు రిక్వెస్ట్ చేశారు... అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సంక్రాంతికి గుంటూరు కారంతో...
సూపర్ స్టార్ మహేశ్ బాబు.. కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తండ్రికి మించిన తనయుడిగా తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక వయసు పెరిగే కొద్ది ఆయనకు అందం పెరుగుతూ వస్తుందా అనే రేంజులో తన గ్లామర్ మెయిన్ టైన్ చేస్తాడు మహేశ్. ఇక ఆ విషయం పక్కన పెడితే.. మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.

వీరి కాంబో నెక్ట్స్ లెవెల్
గుంటురుకారం సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ మూవీ తర్వాత మహేశ్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసింందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి కారణం రాజమౌళికి ఉన్న క్రేజ్... మహేశ్ బాబుకు ఉన్న ఫ్యాన్స్... వీరి కాంబోలో మూవీ నెక్ట్స్ లెవెల్ అంటున్నారు.

జక్కన్నకు మహేశ్ రిక్వెస్ట్
ఇక మహేశ్ రాజమౌళి మూవీలో హీరోయిన్ విషయంలో చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. అయితే జక్కన్నకు మహేశ్ బాబు తన ఫేవరెట్ హీరోయిన్ ను సజెస్ట్ చేస్తున్నారని తెలిసింది. ఆమె ఎవరో కాదు... లోకనాయడుకు కుమార్తే శృతి హాసన్. ఆమె ఈ పాన్ వరల్డ్ సినిమాలో హీరోయిన్ గా అయితే బాగుంటుందని మహేశ్ బాబు..జక్కన్నకు స్పెషల్ రిక్వెస్ట్ చేశారట. ఇప్పటికే సలార్ లాంటి ప్రాజెక్టులో శృతిహాసన్ నటిస్తుంది.
మరోసారి సిల్వర్ స్క్రీన్ పై
ఇప్పుడు మహేశ్ బాబు, రాజమౌళి ప్రాజెక్టులో హీరోయిన్ గా చేస్తే.. సినిమాకు మరింత కలిసి వస్తుందని అనుకుంటున్నారట. మరి మహేశ్ రిక్వెస్టును రాజమౌళి యాక్సెప్ట్ చేస్తారో లేదో చూాడాలి. ఇక మహేశ్ బాబు, శృతి హాసన్ కాంబోలో ఇదివరకే ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో శ్రీమంతుడు సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా స్క్రీన్ పై ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు మరోసారి ఈ జంట స్క్రీన్ పై మెరిస్తే.. ఫ్యాన్స్ కు పండగే అని చెప్పవచ్చు.

బాలీవుడ్ బ్యూటీపై జక్కన్న కన్ను..
అయితే జక్కన్న... సౌత్ హీరోయిన్స్ కంటే.. బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావిస్తున్నారట. బాలీవుడ్ అయితే... హిందీలో కూడా ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడుతుందని జక్కన్న ప్లాన్. మరి మహేశ్ బాబు రిక్వెస్టును జక్కన్న యాక్సెప్ట్ చేస్తాడా.. లేదా వేరే బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకువస్తాడా అనేది వేచి చూడాల్సిందే. లేదంటే ఇద్దరి హీరోయిన్స్ ను పెట్టి సర్ ప్రైజ్ ఇస్తాడా అనేది ఫ్యూచర్ లోనే తేలనుంది.


Click it and Unblock the Notifications











