మహేష్‌ని రిక్వెస్ట్ చేసే పనిలో బాలయ్య.. ఒప్పుకోకుంటే ఇక అంతేనా!
Recommended Video

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి సినీ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ ని ఆరాధ్య దైవంగా భావించే అభిమానులు ఆయన జీవిత చరిత్రని వెండి తెరపై చూసే అవకాశం రాబోతోంది. నందమూరి బాలకృష్ణ స్వయంగా తన తండ్రి పాత్రలో నటించబోతున్నాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుగా బయోపిక్ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో మెస్మరైజ్ చేసే విధంగా కనిపిస్తున్నాడు. అచ్చు ఎన్టీఆర్ పలికిస్తున్నాడు. రానా, సుమంత్ వంటి ప్రముఖ హీరోలు కూడా ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ గురించి అదిరిపోయే వార్త ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్ బయోపిక్‌లో కృష్ణ రోల్
ఎన్టీఆర్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్న సమయంలో ఆయనకు సూపర్ స్టార్ కృష్ణ గట్టి పోటీనిచ్చారు. వీరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ కొనసాగింది. ఎన్టీఆర్, కృష్ణ మధ్య పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనితో కృష్ణ పాత్ర కూడా ఎన్టీఆర్ బయోపిక్ లో ఉండేలా దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మహేష్ పైనే ఆశలు
ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర యూనిట్ కృష్ణ పాత్ర కోసం మహేష్ బాబుపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ ఈ చిత్రంలో భాగమైతే అభిమానుల్లో మరింతగా అంచనాలు పెరుగుతాయి. బాలకృష్ణ కూడా ఈ చిత్రంలో కృష్ణ పాత్ర పట్ల ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మహేష్ బాబు అంగీకరిస్తాడా లేదా అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న.

కృష్ణని చూసినట్లుగానే
ఈ ఏడాది మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంతో అభిమానులని అలరించాడు. ఈ చిత్రంలో ఓ సాంగ్ లో భాగంగా మహేష్ మీసాలతో కనిపిస్తే సూపర్ స్టార్ కృష్ణ ని చూసినట్లుగానే అభిమానులు ఫీల్ అయ్యారు. దీనితో కృష్ణ పాత్రలో మహేష్ ని అద్భుతంగా చూపించవచ్చని దర్శకుడు క్రిష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కూడా మహేష్ ని ఓ సారి ఈ పాత్ర కోసం రిక్వస్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మహేష్ ఒప్పుకోకపోతే
మహేష్ ఈ ప్రతిపాదనకు అంగీకరించకుంటే.. కృష్ణ పాత్ర లేకుండానే సినిమాని పూర్తి చేసే ఆలోచనలో ఎన్టీఆర్ బయోపిక్ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మహేష్ యూఎస్ నుంచి తిరిగి రాగానే కృష్ణ పాత్రకు సంబంధించి ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

అభిమానుల్లో హాట్ టాపిక్
ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఎన్ని మధురమైన ఘట్టాలు, చేదు సంఘటనలు ఉన్నాయి. చాలా మంది కీలక వ్యక్తులు ఎన్టీఆర్ జీవితంలో కీలక పాత్ర పోషించారు. దగ్గుబాటి రానా ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏఎన్నార్ గా హీరో సుమంత్ నటిస్తున్నాడు. జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు, జనవరి 24న ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలని విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











