Rajinikanth జైలర్ స్టోరీ లీక్.. అంతా అన్ని గంటల్లోనే! హిట్ కొడుతుందా అంటే?
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరోలలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒకరు. అభిమానులు ఆయన్ను ముద్దుగా తలైవా అని పిలుచుకుంటారు. తనదైన స్టైలిష్ పర్ఫామెన్స్ తో అదరగొడతారు రజనీ కాంత్. ఎన్నో ఏళ్లుగా సినీ రంగంపై తన మార్క్ చూపిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలతో జోరు చూపిస్తున్న రజనీ కాంత్ నటిస్తున్న తాజా చిత్రం జైలర్. మిల్కీ బ్యూటి తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా స్టోరీ లీక్ అయినట్లు నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఆ లీకైన స్టోరీ కథేంటో చదివేద్దామా!
తలైవా రజనీ కాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా జైలర్. సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రజనీ కాంత కు జోడీగా మిల్కీ భామ తమన్నా నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ అతిథిపాత్రల్లో మెరవనున్నారు. అలాగే ఇందులో రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న జైలర్ సినిమాను ఆగస్టు 10న తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కావాలి అనే పాటలో తమన్నా తన అందచందాలతో కట్టిపడేసింది. ఎన్నో అంచనాలతో వస్తున్న రజనీ కాంత్ జైలర్ మూవీ కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
సినిమాలో రజనీకాంత్ ఓ జైలుకు వార్డెన్ గా ఉంటారట. రజనీ వార్డెన్ గా ఉన్న జైలుని ఓ విలన్ గ్యాంగ్ బ్రేక్ చేయాలని ప్లాన్ చేస్తుంది. జైలులో గ్యాంగ్ కు సంబంధించిన నాయకుడు కూడా ఉంటాడు. ఆ విలన్ ప్లాన్స్ కు ఎదుర్కోలేని జైలు స్టాఫ్ చేతులెత్తేస్తారు. అప్పుడే జైలుకు వార్డెన్ గా ఉన్న రజనీకాంత్ ఒక్కడే ఆ గ్యాంగ్ నుంచి జైలును కాపాడుతాడట. అలాగే గ్యాంగ్ నాయకుడిని కూడా జైలు నుంచి వెళ్లకుండా చేస్తాడని టాక్.
జైలర్ సినిమా సింగిల్ ఎజెండాతో సాగే స్టోరీ అని సోషల్ మీడియాలో తెగ టాక్ నడుస్తోంది. అంతేకాకుండా జైలర్ స్టోరీ అంతా 24 గంటల వ్యవధిలోనే నడుస్తుందని మరో న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఇదిలా ఉంటే బీస్ట్ సినిమాతో చేతులు కాల్చుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ రజనీకాంత్ అవకాశమిచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











