సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... ఆ సూపర్ హిట్ సినిమాకు రాబోతున్న సీక్వెల్!
సూపర్ స్టార్ ఫ్యాన్సుకు గుడ్ న్యూస్.. రజినీకాంత్ సూపర్ హిట్ మూవీకి త్వరలో సీక్వెల్ రాబోతుంది. బాక్సాఫీస్ వద్ద టైగర్ కా హుకుమ్ అంటూ రజినీకాంత్ రేపిన రచ్చ అంతా ఇంతా కాదు.. జైలర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజినీకాంత్.. ఇప్పుడు మరోసారి జైలర్ 2 సినిమాతో వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఇక జైలర్ 2 చిత్రం కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు మేకర్స్. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రజినీ కాంత్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ కు పండగే. ఇక గత ఏడాది రజినీ కాంత్ జైలర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బీస్ట్ వంటి సినిమా తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ ఆగస్టు 10న థియేటర్లోకి వచ్చింది. ఇక ఈ సినిమాకు పోటీగా తెలుగులో భోళా శంకర్ రిలీజ్ అయి ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఆ విషయం పక్కన పెడితే.. జైలర్ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయి.. థియేటర్ వద్ద పంజా విసిరింది.

ఇక రజినీ కాంత్ పని అయిపోయింది.. సినిమాలు మానేసి.. హిమాలయాల్లో సెటిల్ అయితే బెటర్.. ఇంకా ఏం సినిమాలు తీస్తారు అంటూ వచ్చిన కామెంట్స్ కు.. జైలర్ సినిమాతో రజినీ కాంత్ సమాధానం చెప్పాడు. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించింది. ఇక హీరోయిన్ గా తమన్నా నటించగా.. ఈ సినిమాకు అదిరిపోయే బిజీఎం, సంగీతం అందించాడు అనిరుద్ రవిచంద్రన్.
సినిమా విడుదల అయిన మొదటి రోజునుంచే.. పాజిటివ్ టాక్ వచ్చింది. రజనీ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక జైలర్ సిినిమా క్లైమాక్స్ లోనే సీక్వెల్ హింట్ ఇచ్చాడు దర్శకుడు. చివర్లో హీరోతో విలన్ అనే డైలాగ్ ఈ సీక్వెల్ పుకార్లకు కారణం కాగా.. ఇప్పుడు ఆ సీక్వెల్ రాబోతుందని కన్మార్మ్ అయింది. జైలర్ సినిమాలో విలన్ చెప్పే డైలాగ్... నెట్ వర్క్ గురించి చెబుతూ.. వాళ్ల నుంచి నువ్వు తప్పించుకోలేవు అంటూ వార్నింగ్ ఇస్తాడు.

ఇక సినిమాలో మూడు ఇండస్ట్రీల నుంచి హీరోలను దింపడంతో.. వీరందరినీ కలిపి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ సీక్వెల్ తెరకెక్కిస్తాడనే వార్తలు వచ్చాయి. అనుకున్నట్లుగానే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డారట మేకర్స్. నెల్సన్ దిలీప్ కుమార్, రజినీకాంత్, అనిరుద్ రవిచంద్రన్.. ఇప్పటికే ఈ సినిమాపై కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రానుందట.
అయితే తన 50 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ సీక్వెల్స్ జోలికి వెళ్లని రజనీకాంత్.. జైలర్ సీక్వెల్ ను ఒప్పుకోవడం విశేషం. అంతేకాదు ప్రస్తుతం రజనీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. లాల్ సలామ్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఇక ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కనుందో.. ఎప్పుడు రిలీజ్ కానుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











