మిస్టర్ ఇండియాతో సూపర్ స్టార్ లొల్లి... సర్కారు వారిపాట ప్రత్యేకం

ఏజ్ పెరుగుతున్న కొద్దీ సూపర్ స్టార్ మహేశ్ బాబు మరింత స్మార్ట్ గా మారిపోతున్నాడనే చెప్పాలి. సర్కారువారి పాట ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ మాట మనసులో అనుకోకుండా ఉండలేరు మరి. మరి మన హ్యాండ్సమ్ ప్రిన్స్ తో తలపడాలంటే, విలన్ కు కూడా అదే రేంజ్ ఉండాల్సిందే. అందుకే ఏరి కోరి బాలీవుడ్ నుంచి ఓ బాడా నటుడిని దించేస్తున్నాడు సర్కారు వారి పాట డైరెక్టర్.

మిస్టర్ ఇండియా...

మిస్టర్ ఇండియా...

ఇప్పటికైతే సర్కారు వారి పాటకు సంబంధించిన వివరాలు ఏమీ ఇంకా బయటకు తెలీలేదు. అయితే విలన్ విషయంలో మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గకూడదన్న ఆలోచనతో బాలీవుడ్ పై దృష్టిసారించారట దర్శక-నిర్మాతలు. ఇక, అక్కడ సీనియర్ హీరోలను కాచి వడబోశాక, మిస్టర్ ఇండియాకే పట్టకట్టాలని ఫిక్స్ అయ్యారు.

హాట్ విలన్ అతడే...

హాట్ విలన్ అతడే...

ఈ మధ్య బాలీవుడ్ లో కారెక్టర్ రోల్స్ చేస్తూ మంచి ఊపుమీద ఉన్న మిస్టర్ ఇండియా, అదేనండి అనీల్ కపూర్ సర్కారు వారి పాటలో విలన్ గా నటించనున్నాడని తెలుస్తోంది. గతంలో హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ - గోస్ట్ ప్రోటోకాల్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన అనీల్ కపూర్, బాలీవుడ్ లో మలంగ్ అనే చిత్రంలోనూ విలన్ గా మెప్పించాడు. దీంతో సూపర్ స్టార్ ను ఢీకొట్టేందుకు ఇతడే కెరెక్ట్ అని టీమ్ భావిస్తోంది.

హ్యాండ్ ఇచ్చిన సుదీప్

హ్యాండ్ ఇచ్చిన సుదీప్

అయితే తొలుత సాండల్ వుడ్ స్టార్ కిచ్చ సుదీప్ ను సర్కారు వారి పాటలో విలన్ రోల్ కు అనుకున్నారు. ఈమేరకు సంప్రదింపులు కూడా జరిగాయని తెలుస్తోంది. కానీ, డేట్స్ విషయంలో తేడా రావడంతో సుదీప్ ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందిట. దీంతో ఇప్పుడు అనీల్ కపూర్ ఎంట్రీకి మార్గం సుగమం అయింది.

Recommended Video

Johar Movie Fame Ankit Koyya's Life Turned By A Single Video
మహానటితో రొమాన్స్...

మహానటితో రొమాన్స్...

ఇక సర్కారు వారి పాటకు తమన్ స్వరాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటర్ గా పనిచేయనున్నాడు. ఇక హీరోయిన్ గా కీర్తి సురేశ్ పేరు వినిపిస్తోంది. మరి మిస్టర్ ఇండియాతో ఫైటింగ్ కు సిద్ధమైన సూపర్ స్టార్ మహానటితో రొమాన్స్ చేస్తాడేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X