పాపం... సాయి ధరమ్ తేజ్ పెళ్లి అవ్వదా.. అందరూ అదే అంటే చేసుకునేది ఎవరు?
సాయి ధరమ్ తేజ్.. మెగా కాంపౌండ్ నుంచి హీరోగా అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం బ్రో. ఈ సినిమాలో మొదటి సారిగా ఆయన మేనమామ పవన్ కల్యాణ్ తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. సాయి ధరమ్ తేజ్ తన పెళ్లి గురించి మాట్లాడాడు. ఆ వివరాల్లోకి వెళితే...
అలా ఎంట్రీ ఇచ్చి : పిల్ల నువ్వులేని జీవితం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఆ తర్వాత రేయ్ చిత్రం చేశాడు. ఇక ఆ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల విరూపాక్ష సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న తేజ్.. ప్రస్తుతం బ్రో అనే చిత్రంతో రాబోతున్నాడు.

విడుదలకు సిద్ధం : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. ఈ చిత్రం తమిళంలో విజయవంతమైన 'వినోదయ సీతమ్'కు రీమేక్ గా వస్తోంది. సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెలలోనే రిలీజ్ కానుంది. పీపుల్స్ మీడియా ఈచిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈనెల 28న అన్ని భాషల్లో విడుదల కాబోతోంది. విడుదల తేజీ దగ్గర పడుతుండంతో.. ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంత చేశారు మేకర్స్.

మంచి ఆదరణ : ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాదు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక నిన్న ఈ చిత్రం నుంచి జానవులే అనే బ్యూటీఫుల్ సాంగ్ రిలీజ్ కాగా ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ సందడి చేశాడు. అక్కడ తన పెళ్లి గురించి మాట్లాడాడు.

పెళ్లి ప్రస్తావన : తిరుపతిలో జరిగిన సెకండ్ సింగిల్ లాంచ్ కార్యక్రమంలో తేజు తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు. ఫ్యాన్స్ తన పెళ్లి ఎప్పుడో చెప్పాలి అని అడగ్గా... ఇంకెక్కడి పెళ్లి బ్రో... ఈ సినిమాకు ముందు ఎవరో ఒకరు ట్రై చేసేవారు. కానీ ఇప్పుడు అందరూ నన్ను బ్రో అనే పిలుస్తున్నారు.. అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. ఆ మాటతో అక్కడ ఉన్నవాళ్లలో నవ్వులు పూయించాడు. అయితే ఇప్పట్లో సాయి ధరమ్ తేజ్ పెళ్లి లేదని తెలుస్తోంది.

ఇప్పట్లో లేనట్లే : ఇక రెండేళ్ల క్రితం సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అంతకు ముందే ఓ అమ్మాయితో పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు అనుకున్నారట. కానీ ప్రమాదం జరగడం.. అన్నీ సర్దుకున్నాకే చేసుకుంటానని తేజు చెప్పడంతో.. ఆ పెళ్లి వాయిదా పడిందని సమాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రభాస్ తర్వాత సాయి ధరమ్ తేజ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నారు. ఇక మెగా కుటుంబంలో త్వరలో వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతుందన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











