For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన సురేఖా వాణి.. ఆ పనుల్లో చాలా బిజీగా ఉన్నాను అంటూ..

  |

  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సురేఖావాణి తెలుగులోనే కాకుండా ఇతర సౌత్ భాషల్లో కూడా మంచి క్రేజ్ అందుకుంది. సౌత్ లో దాదాపు స్టార్ హీరోలందరి సినిమాలో ఆమె నటించింది. మదర్, సిస్టర్, వదిన వంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో కనిపించిన సురేఖావాణి సినిమాల్లో ఎంత చురుగ్గా కనిపిస్తుందో అలాగే రియల్ లైఫ్ లో కూడా దర్శనమిస్తోంది. ఇక ఆమె సెకండ్ మ్యారేజ్ రూమర్స్ గత కొంతకాలంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌కు చెందిన ఓ వెబ్‌సైట్ రాసిన గాసిప్‌పై ఫైనల్‌గా ఆమె క్లారిటీ ఇచ్చారు.

   అందం వయసు తగ్గుతోంది..

  అందం వయసు తగ్గుతోంది..

  సురేఖావాణి పోస్ట్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆమె ఎలా ఉన్నా ఫోటోలో మాత్రం గ్లామర్ డోస్ తగ్గకుండా చూసుకుంటోంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా అందంగా అవుతోందని ఫాలోవర్స్ నుంచి పాజిటివ్ కామెంట్స్ అందుకుంటోంది. ఒక విధంగా అందంతో ఆమె కూతురికి కూడా పోటీ ఇస్తోందని అంటున్నారు.

  రెగ్యులర్ గా గ్లామర్ ఫొటోలతో..

  రెగ్యులర్ గా గ్లామర్ ఫొటోలతో..

  ప్రస్తుతం సురేఖావాణి ఫొటోలు ఇన్స్టాగ్రామ్ లో చాలా వరకు వైరల్ అవుతున్నాయి. ఆమె తీసుకుంటున్న సెల్ఫీలతో పాటు కెమెరాకు స్పెషల్ గా స్టీల్స్ ఇచ్చిన స్టిల్స్ కూడా నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. చాలా వరకు సురేఖ వాణి గ్లామర్ గా కనిపించడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సురేఖ వాణి కూతురు కూడా అదే రేంజ్ లో ఫొటోస్ కి స్టిల్ ఇవ్వడం వైరల్ అవుతోంది.

  సునీత తరహాలోనే రెండవ పెళ్లి..

  సునీత తరహాలోనే రెండవ పెళ్లి..

  ఇక చాలా రోజుల తరువాత సురేఖావాణికి సంబంధించిన ఒక రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె రెండవ పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు అనేక రాకల కథనాలు వెలువడుతున్నాయి. సింగర్ సునీత తరహాలోనే కుటుంబ సభ్యుకు సపోర్ట్ తో ఆమె పెళ్లికి ఒప్పుకున్నట్లు కూడా స్టోరీలు అల్లేశారు.

  క్లారిటీ ఇచ్చిన సురేఖావాణి

  క్లారిటీ ఇచ్చిన సురేఖావాణి

  అయితే ఫైనల్ గా ఆ రూమర్స్ పై సురేఖావాణి క్లారిటీ ఇచ్చేసింది. అందులో ఎలాంటి నిజం లేదని అంటూ ప్రస్తుతం తన కూతురితో హ్యాపీగా ఉన్నానని, అలాంటి ఆలోచన తనకు ఏ మాత్రం రాలేదని సినిమాలతో కూడా చాలా బిజీగా ఉన్నట్లు చెప్పింది. అంతే కాకుండా కుటుంబ సభ్యుల నుంచి గాని తన కూతురి నుంచి గాని సెకండ్ మ్యారేజ్ చేసుకోమ్మని ప్రెజర్ ఏమి రాలేదని తెలిపింది.

  చివరిదశలో భర్త దగ్గరే..

  చివరిదశలో భర్త దగ్గరే..

  సురేఖావాణి క్లారిటీ ఇవ్వడంతో రూమర్స్ అన్ని అబద్దాలని తేలిపోయింది. సురేఖావాణి ప్రస్తుతం తమిళ్ తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. ఆమె భర్త సురేష్ తేజ 2019లో మృతిచెందిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో సురేష్ తేజ హాస్పిటల్ లో ఉన్న చివరి దశలో సురేఖ భర్త దగ్గరే ఉన్నారు. ఆ సమయంలో ఆమె చాలా సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందట.

  కూతురి ఎంట్రీ పై క్లారిటీ..

  కూతురి ఎంట్రీ పై క్లారిటీ..

  సురేఖ వాణి ఏకైక సుప్రిత కూడా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను గట్టిగానే పెంచుకుంటోంది. ఇక ఆమె కూడా సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని గతంలో కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆమె ఒక యువ హీరోతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ కూడా వచ్చింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని సురేఖ వాణి క్లారిటీ ఇచ్చింది. భవిష్యత్తులో మాత్రం సుప్రిత సినిమాల్లోకి రావాలని అనుకుంటే.. తాను మాత్రం అడ్డు చెప్పానని.. అది తన కూతురి ఇష్టమని సురేఖ వాణి వివరణ ఇచ్చింది.

  English summary
  There has been some news in the past that Surekhavani's daughter Supritha is making an entry into Tollywood soon. It was rumored that she would be playing the lead role in a young hero's movie. Rumors do not diminish despite Clarity's offer. Surekha Vani gave a description of her daughter's life. This resulted in a clarity on the Tollywood entry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X