»   » సురేంద్రరెడ్డి ఎన్టీఆర్ 'రచ్చ' తర్వాత ప్రాజెక్టు ఆ స్టార్ తో...

సురేంద్రరెడ్డి ఎన్టీఆర్ 'రచ్చ' తర్వాత ప్రాజెక్టు ఆ స్టార్ తో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అతనొక్కడే చిత్రంతో పరిచయమైన సురేంద్రరెడ్డి ఆ తర్వాత అశోక్, అతిధి వంటి ఫ్లాపులిచ్చినా కిక్ వంటి మెగా హిట్ చిత్రంతో మళ్ళీ నిలబడ్డారు. తాజాగా ఆయన ఎన్టీఆర్ ని డైరక్ట్ చేస్తున్నారు. "రచ్చ" అనే టైటిల్ తో రూపొందే ఈచిత్రంతో ప్రారభమయ్యే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో సురేంద్రరెడ్డి నెక్ట్స్ ప్రాజెక్టుని ఏ హీరోతో చేయబోతున్నాడనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సురేంద్రరెడ్డి ఎన్టీఆర్ చిత్రం తర్వాత నాగార్జునతో చిత్రం చేయబోతున్నారు.రచ్చ నిర్మాత బి.వి.యస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించటానికి ముందుకొచ్చాడని టాక్. అయితే ప్రాజెక్టు ఇంకా అఫీషియల్ గా ఖరారు కాలేదు. నాగార్జునకి ఓ లైన్ వినిపించటం ఆయన గో ఎ హెడ్ అనటం మాత్రం జరిగాయని వినకిడి.

ఇక రచ్చ చిత్రంలో ఎన్టీఆర్ నుండి ప్రేక్షకులు, అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉంటూనే సరికొత్త టైప్ లో సాగే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది అని ఈ చిత్రం గురించి దర్శకుడు సురేంద్రరెడ్డి చెప్తున్నారు. ఎన్టీఆర్ సరసన తమన్నా ఓ హీరోయిన్. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించి జనవరి 8 నుండి ఏకధాటిగా షేడ్యూల్ చేస్తారు. ఎన్టీఅర్, తమన్నా, కిక్ శ్యాం, ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్ధి, అలీ, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, వేణు మాధవ్, ఎమ్.ఎస్. నారాయణ, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, వెనకట్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కధ...వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రసూల్ ఎల్లూర్, పాటలు: చంద్రబోస్, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: కోటగిరి విద్యాధరరావు

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu