»   » డైరక్టర్ సురేంద్రరెడ్డి...తమిళ్ నుంచి రీమేక్ చేస్తున్నాడు

డైరక్టర్ సురేంద్రరెడ్డి...తమిళ్ నుంచి రీమేక్ చేస్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు సురేంద్రరెడ్డి రీమేక్ చిత్రానికి డైరక్షన్ చేయబోతున్నారా అంటే అవుననే వినపడుతోంది. ఫామ్ లో ఉన్న ఆయన్ను కిక్ ఇచ్చి రీమేక్ చేసేటంత ఉత్సాహం తెచ్చిన సినిమా ఏంటీ అంటే తమిళంలో సూపర్ హిట్ అయిన 'గోలీసోడా' అని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ దశాబ్ద కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రానికి మహిళాదరణ మరింత పెరిగిందని నిర్మాతలు లగడపాటి శిరీష, శ్రీధర్ తెలిపారు. ప్రిన్స్ మహేశ్ బాబు ట్వీట్ తో మహిళలు ఎక్కువగా థియేటర్ కు వస్తున్నారని, ఆదివారం ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా అత్యధికంగా వచ్చారని వారన్నారు. ఫీల్ గుడ్ మూవీని తమదైన శైలిలో ప్రజల్లోకి తీసుకెళ్ళి ఫీల్ గ్రేట్ మూవీగా మలిచామని లగడపాటి శ్రీధర్ తెలిపారు.

పూర్తి వివరాల్లోకి వెళితే....

Surender Reddy directs a re-make

లగడపాటి శ్రీధర్ తాజాగా తమిళ చిత్రం 'గోలీసోడా' రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. నలుగురు కుర్రాళ్ళకు సంబంధించిన ఈ చిత్రంలో శ్రీధర్ కుమారుడు మాస్టర్ విక్రమ్ నటించబోతున్నాడు. విక్రమ్ ఇప్పటికే విజయవంతమైన చిత్రాలు 'రేసుగుర్రం, పటాస్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' లో నటించాడు. దాంతో 'గోలీసోడా' చిత్రానికి సురేందర్ రెడ్డి ని అడిగి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్ళి నవంబర్ 14 లేదా క్రిస్మస్ కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది.

కోయంబేడు మార్కెట్‌లో కొందరు చిన్నారులు తమ గుర్తింపు కోసం చేసే పోరాటం నేపథ్యంలో తెరకెక్కించిన కథ ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా సాదాసీదాగా విడుదలైన ఈ సినిమా చక్కని వసూళ్లు రాబట్టింది. 'దీన్ని తక్కువ బడ్జెట్‌తో కాదు.. అత్యంత తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించా'నని సినిమా విడుదలకు ముందే దైర్యంగా చెప్పారు దర్శకుడు.

అయితే బడ్జెట్ విషయం కలెక్షన్లపై ఎక్కడా ప్రభావం చూపలేదు. కానీ బుల్లితెర హక్కులపై మాత్రం దీని ప్రభావం కనిపించింది. రూ.10 లక్షలకు కొనుక్కునేందుకు కూడా కొన్ని ఛానళ్లు ముందుకు రాలేదు. సినిమా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాక.. ఏకంగా రూ.3కోట్లకు పైగా వెచ్చించి కొనుక్కుంటామని చెబుతున్నాయి. అంటే ఆ మేరకు కూడా సంచలన విజయం సాధించనట్లే కదా. కోయంబేడు మార్కెట్‌లో పని చేసే కుర్రాళ్ల ఇతివృత్తమే గోలీ సోడా అని ఆ చిత్ర దర్శకుడు విజయ్ మిల్టన్ తెలిపారు.

ప్రముఖ ఛాయాగ్రహకుడైన ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం గోలీ సోడా. ఇందులో పసంగ చిత్రం ద్వారా జాతీయ అవార్డులు గెలుచుకున్న బాలనటులు శ్రీరామ్, కిషోర్‌తో పాటు పాండి, మురుగేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో చాందిని, సీత నటించారు. చిత్రం గురించి దర్శకుడు విజయ్ మిల్టన్ తెలుపుతూ చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ మన దేశంలోనే అతిపెద్దదని తెలిపారు.

ఇక్కడకు నిత్యం వేలాది మంది వచ్చి పోతుంటారని పేర్కొన్నారు. అలాంటి మార్కెట్‌లో పని చేస్తూ మగ్గిపోయే నలుగురు కుర్రాళ్లు తమకంటూ ఒక గుర్తింపు కోసం చేసే ప్రయత్నమే గోలీసోడా అని తెలిపారు. చిత్రంలోని ఏడు నిమిషాల 49 సెకన్లు ఉండే ఫైట్ సన్నివేశాన్ని స్టంట్ మాస్టర్ సుప్రియ సుందర్ కంపోజ్ చేయగా ఒక షాట్‌లో చిత్రీకరించినట్లు చెప్పారు. దర్శకుడు పాడిరాజా మాటలు రాశారని పేర్కొన్నారు. అరుణగిరి సంగీతాన్ని అందించారని, చిత్రాన్ని దర్శకుడు లింగుస్వామి సంస్థ తిరుపతి బ్రదర్స్ విడుదల చేయడం సంతోషంగా ఉందని దర్శకుడు తెలిపారు.

'గోలీసోడా'ని చూసిన తర్వాత రజనీకాంత్ ఓ ప్రకటన విడుదల చేశారు. ''కోయంబేడు మార్కెట్ నేపథ్యంలో అద్భుతమైన సినిమా చేశారు. చాలా ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా నలుగురు కుర్రాళ్ల నటన అద్భుతం. దర్శకుడి పని తీరు నాకు నచ్చింది. అందుకే, ఫోన్ చేసి అభినం దించాను. తన తదుపరి చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని ఆ ప్రకటనలో రజనీ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని అనుష్క, సమంత, మురుగదాస్ తదితర ప్రముఖులు కూడా మెచ్చుకున్నారు.

English summary
Director Surender Reddy is going made a re-make of the Tamil film ‘Goli Soda’.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu