సురేంద్రరెడ్డి నెక్స్ట్ ఆ స్టార్ హీరోతోనే...
ఊసరవెల్లి చిత్రంతో ముందుకు వచ్చిన సురేంద్ర రెడ్డి ఇప్పుడు తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సారి పవన్ కళ్యాణ్ ని డైరక్ట్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. మహేష్, ఎన్టీఆర్ అయ్యారు కాబట్టి నెక్ట్స్ టార్గెట్ పవనే అని తెలుస్తోంది. ఈ మేరకు ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు పవన్ తో మాట్లాడినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారే సురేంద్ర రెడ్డి తదుపరి చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే మీడియాతో మాత్రం సురేంద్రరెడ్డి.. ఊసరవెల్లి చిత్రాన్ని హిందీలో తెరకెక్కిస్తాను. 'ఊసరవెల్లి'కి అక్కడ రణధీర్‌కపూర్ అయితే బావుంటుందని నా నమ్మకం. 'కిక్'ను కూడా హిందీలో చేయమని నన్ను అడిగారు. కానీ అప్పుడు 'ఊసరవెల్లి'తో బిజీగా ఉన్నాను. అక్కడ ఇంకా ఆ సినిమా ప్రారంభం కాలేదు. తదుపరి ప్రోగ్రెస్‌ను త్వరలో ప్రకటిస్తాను.'' అన్నారు.ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం పంజాని పూర్తి చేసుకుని గబ్బర్ సింగ్ ప్రారంభించారు. అలాగే ఆర్.ఆర్ మూవి మేకర్స్ వారు ..మహేష్ తో ది బిజినెస్ మ్యాన్ చిత్రం తీస్తున్నారు.
ఇక ఊసరవెల్లి చిత్రం సమష్టి కృషి ఫలితమిది. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌గారి ప్రొడక్షన్ వేల్యూస్ అమేజింగ్. తమన్నా చాలా బాగా నటించింది. ఈ చిత్రానికి ఆమెకు అవార్డు వస్తుందన్న నమ్మకం ఉంది. ఎన్టీఆర్‌కు డెడికేషన్ ఎక్కువ. సినిమా సినిమాకూ ఆయనకు నటన పట్ల మోజు పెరగడాన్ని గమనించాను అన్నారు. అలాగే ఈ కథను వక్కంతం వంశీ నాకు చెప్పినప్పుడు వెంటనే ఎన్టీఆర్ అయితే బావుంటుందనుకున్నాం. ఎన్టీఆర్ కథ విని 'కిల్ చేయవద్దు... ఉన్నదున్నట్టు చేయండి' అన్నారు. అదే సినిమాకు ప్లస్సయింది. అలాగే టైటిల్ కూడా సినిమాకు మంచి క్రేజ్‌ను తెచ్చింది. నిజానికి ఊసరవెల్లి ఎవరికీ హాని చేయదు. తన కోసం అది రంగులు మార్చుకుంటుంది. మా నాయకుడికి పాత్ర తీరుకు చక్కగా కుదిరే టైటిల్ అని పెట్టాం. జనాలు అంగీకరించారు. ఈ చిత్రాన్ని మేమేం హీరో ఇమేజ్‌కు దూరంగా తీయలేదు. హీరోయిన్‌కు ధైర్యాన్నిచ్చే వెలుగు అని హీరోని చూపించాం. అంతకన్నా మాస్ అంశం ఇంకేం ఉంటుంది అని తేల్చి చెప్పారు.


Click it and Unblock the Notifications











