మహేశ్, ప్రభాస్ చేసిన పని మెగా హీరోకు మేలు చేసిందట.. ఆ డైరెక్టర్ ఆగాల్సిందే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. వీరిద్దరూ భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ క్రమంగా యూనివర్శల్ స్టార్లుగా పరిణితి చెందుతున్నారు. ఈ క్రమంలో వారి మార్కెట్ కూడా గణనీయంగా పెరిగిపోతోంది. దీంతో టాలీవుడ్‌లోని దర్శకులందరూ సినిమాలు చేయమంటూ వీళ్ల వెంట పడుతున్నారు. కానీ, వీళ్ల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో చాలా మంది నిరాశగా వెనుదిరుగుతున్నారు. తాజాగా ఓ డైరెక్టర్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అది ఓ మెగా హీరోకు మేలు చేసింది. ఇంతకీ ఎవరా డైరెక్టర్..? ఏంటా మేలు.?

భారీ సక్సెస్ అందుకున్నాడు
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘సైరా: నరసింహారెడ్డి'ను తెరకెక్కించాడు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణెదల ప్రొడక్షన్స్‌పై స్వయంగా నిర్మించాడు. ఎన్నో అంచనాలతో విడుదల అయిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. దీంతో సైరా సూపర్ సక్సెస్ అయింది.

ప్రభాస్‌తో సినిమా అనుకున్నారు
‘సైరా' సక్సెస్ తర్వాత సురేందర్ రెడ్డి.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో సినిమా చేస్తాడని, అది కూడా పాన్ ఇండియా సినిమా అని జోరుగా ప్రచారం జరిగింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ‘జాన్'ను కూడా పక్కన పెట్టేశాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలో నిజం లేదని ఆ తర్వాత తెలిసింది. ప్రభాస్ ‘జాన్' సినిమా పూర్తి చేయాలనుకుంటుండడమే దీనికి కారణం.

మహేశ్‌తో పక్కా అన్నారు
ప్రభాస్ గురించి వస్తున్న వార్తలకు పుల్‌స్టాప్ పడిన వెంటనే సురేందర్ రెడ్డి.. సూపర్ స్టార్ మహేశ్ బాబును డైరెక్ట్ చేయబోతున్నాడని ప్రచారం మొదలైంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు' తర్వాత ఈ సినిమా ప్రారంభం అవుతుందని అన్నారు. కానీ, మహేశ్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమా చేయడం లేదట.

నిర్మాతగా మారడని ప్రచారం
ఇక, రెండు రోజుల క్రితం సురేందర్ రెడ్డి నిర్మాతగా మారబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇందుకోసం ఆయన రెండు కథలు, వాటికి స్క్రీన్‌ప్లేలు రెడీ చేసుకున్నాడట. ఆ కథలతో తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తూ సినిమా నిర్మించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సినిమాలు కొత్త వారితో మాత్రమే చేస్తారని కూడా టాక్ వినిపించింది.

మెగా హీరోతో సినిమా
‘సైరా' తర్వాత సురేందర్ రెడ్డి మరోసారి మెగా హీరోతోనే సినిమా చేయబోతున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఆ హీరో ఎవరో కాదు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రభాస్, మహేశ్ కోసం అనుకున్న కథతోనే ఈ సినిమా పట్టాలెక్కనుందట. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.
Recommended Video

ఆ డైరెక్టర్ ఆగాల్సిందేనా?
వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న బాక్సింగ్ నేపథ్య సినిమా చేస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తవ్వాలి. కానీ, దీనికి గ్యాప్ ఇచ్చి ‘గద్దలకొండ గణేష్' పూర్తి చేశాడు. దీని తర్వాత అయినా ఈ సినిమా అవుతుందని అనుకుంటే.. సురేందర్ రెడ్డి సినిమా చేయడానికి మరోసారి దీన్ని పక్కన పెట్టబోతున్నాడట వరుణ్. దీంతో సదరు దర్శకుడు మరికొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందట.


Click it and Unblock the Notifications











