అక్కినేని హీరోపై కన్నేసిన సైరా దర్శకుడు.. సెట్టయితే లక్కు మారినట్లే?
రానున్న రోజుల్లో హీరోలు దర్శకులు చాలా బిజీ కానున్నారు. ఇచ్చిన కమిట్మెంట్స్ కి వీలైనంత త్వరగా సినిమాలు అందించాలి కాబట్టి కరోనా వైరస్ తీవ్రత తగ్గిన వెంటనే సినిమా షూటింగ్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే కొంత మంది దర్శకులకు ఇప్పుడు హీరోలు దొరకడం లేదు. ఎందుకంటే స్టార్ హీరోలు భవిష్యత్తు కోసం ఇప్పుడే వరుసగా నాలుగైదు ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నారు.
దీంతో ఆ ఎఫెక్ట్ కొంతమంది దర్శకులపై పడుతోంది. కనీసం మిడియమ్ రేంజ్ హీరోల డేట్స్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. అలాంటి దర్శకుల లిస్ట్ లో సురేందర్ రెడ్డి ఒకరు. సైరా సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకోవాలని అనుకున్న ఆయనకు సరైన సక్సెల్ అయితే అందలేదు. దీంతో మళ్ళీ తన ఫార్ములాతోనే కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

కానీ సురేందర్ రెడ్డికి ప్రస్తుతం స్టార్ హీరోల డేట్స్ దొరకడం లేదు. అందుకే షూటింగ్స్ స్టార్ట్ అయ్యే సమయానికి ఎవరినో ఒకరిని సెట్ చూసుకోవాలని చూస్తున్నాడు. అందులో భాగంగా ఆయన అక్కినేని యువ హీరోపై కన్నేసినట్లు తెలుస్తోంది. అఖిల్ తోనే తనదైన శైలిలో ఒక మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఇక అఖిల్ నుంచి నెక్స్ట్ మెస్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రానున్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక ఆ సినిమా అనంతరం అఖిల్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. మరి ఆ అఖిల్ కి ఈ స్టార్ దర్శకుడు ఎలాంటి సక్సెస్ ఇస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











