సురేందర్ రెడ్డికి బంపర్ ఆఫర్... ఆ ఖర్చంతా రామ్ చరణ్ భరించబోతున్నాడట?
ఖైదీ నెం.150 తర్వాత తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం బడ్జెట్ కూడా భారీగానే ఖర్చుపెట్టారు. దాదాపు రూ. 270 కోట్లు ఈ ప్రాజెక్ట్‌పై ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం.
దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ ప్రాజెక్టు మీద గత రెండున్నర సంవత్సరాలుగా పని చేస్తున్నారు. ఈ కాలంలో ఆయన ప్రతి క్షణం ప్రాజెక్టే అంకితమై పని చేశారు. ఎన్నో రాత్రులు నిద్రలేకుండా పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'సైరా' రిలీజ్ తర్వాత ఈ పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు లాంగ్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సురేందర్ రెడ్డి వెకేషన్ ఖర్చంతా రామ్ చరణ్ భరించబోతున్నాడట
‘సైరా' మూవీ విడుదల తర్వాత సురేందర్ రెడ్డి వెళ్లబోతున్న వెకేషన్ ఖర్చు మొత్తం రామ్ చరణ్ భరించబోతున్నారట. తన ప్రాజెక్ట్ కోసం ఇంత కాలం ఆయన పడ్డ కష్టానికి కాంప్లిమెంటులా రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చర్చించుకుంటున్నారు.

స్పెయిన్‌తో పాటు యూరఫ్ దేశాలు
తన వెకేషన్లో సురేందర్ రెడ్డి స్పెయిన్‌తో పాటు మరికొన్ని యూరఫ్ దేశాలు చుట్టిరాబోతున్నట్లు తెలుస్తోంది. యూరఫ్ టూర్ ప్లాన్ ఆల్రెడీ ప్రీ బుకింగ్ చేశారని, ఆన్ లైన్ ద్వారా హోటల్స్, ఫ్లైట్ టికెట్స్ కూడా రామ్ చరణ్ బుక్ చేయించినట్లు తెలుస్తోంది.

గ్రాండ్ రిలీజ్ దిశగా ప్రయత్నాలు
‘సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని ఆక్టోబర్ 2న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీ కావడంతో దేశ వ్యాప్తంగా వీలైనంత ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేయబోతున్నారు.

సైరా నరసింహారెడ్డి
ఈ చిత్రంలో ఉయలవాడ నరసింహరెడ్డిగా చిరంజీవి, అవకు రాజుగా సుదీప్, రాజా పాండిగా విజయ్ సేతుపతి, వీరరెడ్డిగా జగపతి బాబు, సిద్ధమ్మగా నయనతార, లక్ష్మిగా తమన్నా, గురు గోసాయి వెంకన్నగా అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











