‘కిక్’ సురేంద్ర రెడ్డితో పవణ్
'కొమురం పులి" గా కొద్ది నెలల్లో తెర మీదకు రాబోతున్నారు పవన్ కల్యాణ్. ఆ మద్య రాజకీయాలతో సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఈసారి వరుసగా చిత్రాలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారని సమాచారం. ఇప్పుటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించారు. గణేష్ బాబు నిర్మాత. 'కిక్" తో ప్రేక్షకుల్ని వినోదంలో ముంచెత్తిన దర్శకుడు సురేందర్ రెడ్డి. ఆయన చెప్పిన కథాంశం పవన్ కల్యాణ్ కి నచ్చినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ సినిమాకు నిర్మాత డి.వి.వి దనయ్య. సురేందర్ ప్రస్తుతం ఈ స్ర్కిప్ట్ పనుల్లో ఉన్నారని తెలిసింది. పవన్ కల్యాణ్-సురేందర్ ల చిత్రానికి సంబందిచిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో తెలుస్తాయి.
surender reddy pawan kalyan komaram puli kick dvv danaiah harish shankar కొమురం పులి పవన్ కల్యాణ్ హరీష్ శంకర్ కిక్ సురేందర్ రెడ్డి డివివి దనయ్య


Click it and Unblock the Notifications