సైరా డైరెక్టర్ పక్కా ప్లాన్.. ప్రభాస్, మహేష్ బాబు అనుకున్నాం కానీ! లేటెస్ట్ అప్‌డేట్
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ సినిమా తెరకెక్కించాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో సురేందర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ చూసి ఫిదా అయ్యారు తెలుగు ప్రేక్షకులు. ఆ నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా చూపిన విధానం టాలీవుడ్ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసింది. దీంతో ఈయన తీయబోయే తదుపరి సినిమా ఏంటనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

గత కొన్ని రోజులుగా హాట్ ఇష్యూ.. సురేందర్ రెడ్డి నెక్స్ట్
ఈ నేపథ్యంలోనే సురేందర్ రెడ్డి తదుపరి సినిమా అంశం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఇష్యూపై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. సురేందర్ రెడ్డికి మహేష్ బాబుకి మధ్య ఒప్పదం కుదిరిందని, సూపర్ స్టార్ మహేష్‌ను కలసిన సురేందర్ రెడ్డి తన వద్ద ఉన్న కథ ఆయనకు వివరించాడని ఇటీవలే కొన్ని వార్తలు విన్నాం.

మహేష్ బాబు కాదు ప్రభాస్..
ఇదిలా ఉండగానే మహేష్ బాబు కాదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందనే వార్తలు గుప్పుమన్నాయి. పాన్ ఇండియా సబ్జెక్ట్‌తో త్వరలోనే ప్రభాస్‌ను కలవాలని సురేందర్ రెడ్డి డిసైడ్ అయ్యారని అన్నారు. ప్రభాస్ రేంజ్‌కి సరిపోయేలా స్క్రిప్ట్ రెడీ చేసి అతిత్వరలో ఆ ప్రాజెక్ట్ ఒకే చేయించాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా టాక్ నడించింది.

రంగం లోకి దిల్ రాజు.. ఇదీ అసలు ప్లాన్!
ఇంతలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సురేందర్ రెడ్డితో సినిమా చేసేందుకు రెడీ అయ్యారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇందులో హీరోగా మహేష్ బాబు గానీ, ప్రభాస్ గానీ ఎవ్వరిని తీసుకున్నా తనకెలాంటి అభ్యంతరం లేదని సురేందర్ రెడ్డితో ఆయన అన్నారని తెలిసింది. సురేందర్ రెడ్డితో సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించేందుకు దిల్ రాజు సిద్ధంగా ఉన్నారని వార్తలు వచ్చాయి.

లేటెస్ట్ ఇన్ఫర్మేషన్.. అసలు సంగతి అది కాదు
ఈ నేపథ్యంలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సురేందర్ రెడ్డి.. ఇటు ప్రభాస్ తో గానీ, అటు మహేష్ బాబుతో గానీ సినిమా చేసేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. తానే సొంతంగా ఓ సినిమా నిర్మించాలని, అందుకోసం పక్కా ప్లాన్ వేస్తున్నారని టాక్ బయటకొచ్చింది. చిత్ర నిర్మాణం వైపు దృష్టి సారించిన సురేందర్ రెడ్డి సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించాలని ఫిక్స్ అయ్యారట.

అంతా కొత్త వాళ్ళే.. ఆ తర్వాతే మరో ఆలోచన
తానే నిర్మాతగా మారి దర్శకత్వ బాధ్యత శిష్యులకు అప్పగించనున్నారట సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో అంతా కొత్త వాళ్లనే తీసుకోవాలనేది మరో ఆలోచనట. కథ తనదే అయినప్పటికీ ఫోకస్ అంతా ప్రొడక్షన్ పైనే పెట్టాలని ఆలోచిస్తున్నారట. మొదట ఓ రెండు సినిమాలను నిర్మించి ఆ తర్వాత పెద్ద హీరోలతో సినిమాల గురించి ఆలోచన చేద్దామని అనుకుంటున్నారట సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











