డైరక్టర్ సురేంద్రరెడ్డి 'ఊసరవెల్లి'?
కిక్ తో మళ్ళీ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు సురేంద్రరెడ్డి తన తాజా చిత్రానికి 'ఊసరవెల్లి' అనే టైటిల్ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. రామ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్ గా చేస్తోంది. హీరో పాత్ర పరస్ధితిని బట్టి స్వభావాన్ని మార్చుకుని సర్వైవ్ అయ్యే పాత్ర కావటంతో ఆ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న చిత్రం కిక్ లాగానే ఆద్యతం ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని చెప్తున్నారు. మొదట ఈ చిత్రానికి టామ్ అండ్ జెర్రీ అనే టైటిల్ అనుకున్నారు. కానీ కథను అనుసరించి ఈ ఊసరవెల్లి టైటిల్ ని పెట్టినట్లు చెప్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే...ఈ చిత్రం ఓపినింగ్ అప్పుడు రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ...ఈ చిత్రంలో రామ్ క్యారెక్టర్ సరిగ్గా సురేంద్రరెడ్డి పర్శనల్ లైఫ్ ని పోలి ఉంటుంది అన్నారు. ఇప్పుడీ విషయం అంతా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. రామ్ సోదరుడు కృష్ణ చైతన్య సమర్ఫిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే ఒకటవ తేది నుంచి ప్రారంభం అవుతుంది.


Click it and Unblock the Notifications











