భారీ బడ్జెట్‌లో వెంకటేష్ 75వ సినిమా.. నారప్ప తరువాత అతనితోనే..
సినిమా షూటింగ్స్ మళ్ళీ రెగ్యులర్ గా ఎప్పుడు మొదలవుతయో తెలియదు గాని కొన్ని కాంబినేషన్స్ కి సంబంధించిన రూమర్స్ మాత్రం అందరిని కన్ఫ్యూజన్ కి గురిచేస్తున్నాయి. ఊహించని కాంబినేషన్స్ సెట్టవుతున్నాయని రోజుకో రుమర్ పుట్టుకొస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ కి సంబంధించిన 75వ ప్రాజెక్ట్ పై కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.
వెంకీ ప్రస్తుతం తన 74వ సినిమా నారప్పతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసి వెంటనే మరో రెండు సినిమాలను పట్టాలెక్కించాలని వెంకీ ఒక పద్దతిలో ప్లాన్ చేసుకున్నాడు. కానీ ప్లాన్స్ అన్ని తారుమారయ్యాయి. ఇక ఈ కరోనా కాలంలో చాలా కథలు విన్న వెంకీ ఇంకా దేనికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

ఇక ఇటీవల సురేష్ బాబు సలహాతో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 75వ సినిమా కాబట్టి భారీ బడ్జెట్ తో హై లెవెల్లో సినిమా తీయాలని అన్నారట. అలాగే వెంకీ నుంచి కమర్షియల్ మాస్ సినిమా వచ్చి చాలా కాలమయ్యింది కాబట్టి ఈ సారి లక్ష్మీ, తులసి వంటి సినిమాల తరహాలో మంచి కథను సెట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారట. అయితే ఇదివరకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఒక సినిమా ఉంటుందని ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో 75వ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











