RC15: రామ్ చరణ్ సినిమాలో మరో సీనియర్ హీరో.. పవర్‌ఫుల్ విలన్‌గా ఆయనకే శంకర్ ఓటు

తెలుగు సినీ ఇండస్ట్రీలోని బడా హీరోలు అందరూ దేశ వ్యాప్తంగా సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక్కొక్కరూ పాన్ ఇండియా రేంజ్‌లో చిత్రాలు చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఇలా ఇప్పటికే పలువురు హీరోలు ఆ రేంజ్ చిత్రాలను పట్టాలెక్కించేశారు. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. ఇప్పటికే అతడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR మూవీలో నటిస్తున్నాడు. ఇది విడుదల కాకముందే మరో భారీ ప్రాజెక్టును ప్రకటించాడు. అది కూడా ఇండియాలోనే దిగ్గజ దర్శకుడిగా పేరొందిన శంకర్‌తో. భారీ అంచనాలున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ సంగతులు మీకోసం!

భారీ చిత్రాల్లో నటించిన రామ్ చరణ్

భారీ చిత్రాల్లో నటించిన రామ్ చరణ్


రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రుధిరం రణం)లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఇందులో అతడు అల్లూరిగా, తారక్ కొమరం భీంగా కనిపించనున్నారు. దీనితో పాటు చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య'లోనూ నక్సలైట్ పాత్రను చేశాడు. ఈ రెండు షూట్స్ కంప్లీట్ అయ్యాయి.

దిగ్గజ దర్శకుడితో ప్రాజెక్టు ప్రకటించి

దిగ్గజ దర్శకుడితో ప్రాజెక్టు ప్రకటించి

RRR, ఆచార్య తర్వాత రామ్ చరణ్ నటించబోయే ప్రాజెక్టు గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకులు పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఊహించని విధంగా చెర్రీ.. దిగ్గజ దర్శకుడు శంకర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ భారీ రేంజ్‌లో తెరకెక్కనుంది.

వెంటనే అవన్నీ కంప్లీట్.. వాళ్ల ఎంపిక

వెంటనే అవన్నీ కంప్లీట్.. వాళ్ల ఎంపిక

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేసే సినిమా కోసం శంకర్ ప్రీ ప్రొడక్షన్ పనులను చాలా వేగంగానే పూర్తి చేశారు. ఆ వెంటనే ఆయన ఈ మూవీ కాస్టింగ్‌ మీద దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ చిత్రం కోసం జయరాం, శ్రీకాంత్, సునీల్, అంజలి తదితరులను ఎంపిక చేశారు. అలాగే, మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్, హీరోయిన్‌గా కియారా అద్వాణీని తీసుకున్నారు.

నేషనల్ లెవెల్ స్టార్ట్.. ఫైట్‌తో మొదలు

నేషనల్ లెవెల్ స్టార్ట్.. ఫైట్‌తో మొదలు

శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగాయి. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దీంతో ఇది నేషనల్ లెవెల్‌లో ట్రెండ్ అయింది. ఇక, ఇప్పుడు ఈ చిత్రం షూట్ ఫైట్‌తో ప్రారంభమై ఫస్ట్ షెడ్యూల్ జరుపుకుంటోంది.

విలన్ ఎవరన్న దానిపై రాని స్పష్టత

విలన్ ఎవరన్న దానిపై రాని స్పష్టత

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాలో నటించే వాళ్ల గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో విలన్‌గా ఎవరు నటిస్తున్నారు అన్న దానిపై చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఎంతో మంది స్టార్ల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. దీంతో ఈ విషయంలో క్లారిటీ కావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

Recommended Video

KGF Chapter 2 Vs RRR : Rajamouli రంగంలోకి దిగితే Yash రికార్డ్ గల్లంతే!! || Filmibeat Telugu
చరణ్ సినిమాలో మరో సీనియర్ హీరో

చరణ్ సినిమాలో మరో సీనియర్ హీరో

శంకర్ - రామ్ చరణ్ కలయికలో రాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో విలన్‌గా మలయాళ సీనియర్ హీరో సురేష్ గోపి నటిస్తున్నారట. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండే ఈ పాత్ర కోసం పలువురు పేర్లను పరిశీలించగా.. ఆయననే ఫైనల్ చేశారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన కూడా రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X