20 ఏళ్ల అమ్మాయితో 45 ఏళ్ల వ్యక్తి ప్రేమ.. గజినీ మళ్లీ రాబోతున్నాడా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'Suriya 46' (వర్కింగ్ టైటిల్)పై తాజాగా వచ్చిన అప్‌డేట్ సినీ వర్గాల్లోనే కాదు... ప్రేక్షకుల్లోనూ పెద్ద చర్చకు దారి తీస్తోంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా స్టోరీ లైన్‌ను నిర్మాత సూర్యదేవర నాగవంశీ రివీల్ చేయడంతో, మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇంతకీ సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?

సూర్య - వెంకీ అట్లూరి కాంబో
సార్, లక్కీ భాస్కర్ లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో మంచి ఫామ్‌లో ఉన్న వెంకీ అట్లూరి.. ఇప్పుడు తొలిసారిగా సూర్యతో కలిసి సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇది సూర్యకు డైరెక్ట్ తెలుగు సినిమా కావడం కూడా విశేషం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా, వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

Suriya 46 Story Revealed Age Gap Love Drama with Venky Atluri Creates Buzz

అసలు స్టోరీ ఏంటంటే?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నాగవంశీ.. Suriya 46 స్టోరీ లైన్‌ను ఓపెన్‌గా వెల్లడించారు. ఈ సినిమా కథ... 45 ఏళ్ల వ్యక్తికి, 20 ఏళ్ల యువతికి మధ్య చిగురించే ప్రేమ అని తెలిపారు. 'ఇది కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు. ఇద్దరి మధ్య ఉండే అల్లరి,అనుబంధం, ఎమోషన్, ఫన్, రిలేషన్‌షిప్ డైనమిక్స్ అన్నీ చూపిస్తాం. 25 ఏళ్ల వయసు తేడా ఉన్న ఇద్దరి మధ్య ప్రేమ ఉండొచ్చా? ఉండకూడదా? అనే ప్రశ్నను ఈ సినిమా లేవనెత్తుతుంది' అని నాగవంశీ చెప్పారు. ఈ సినిమాలో సూర్య పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. 'గజినీ'లోని రిచ్, ఇంటెన్స్ సంజయ్ రామస్వామి క్యారెక్టర్ తరహాలోనే... కానీ ఎమోషనల్ డెప్త్ ఎక్కువగా ఉండే పాత్రలో సూర్య కనిపించనున్నాడట. వయసు, అనుభవం ఉన్న వ్యక్తిగా... జీవితాన్ని కొత్త కోణంలో చూడటం, ప్రేమను అర్థం చేసుకునే తీరు కథకు ప్రధాన బలంగా నిలవనుంది.

ఈ సినిమాలో 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. యువతి పాత్రలో ఆమె నటన కీలకంగా ఉండనుందని టాక్. ఇక సీనియర్ నటి రాధికా శరత్ కుమార్, బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాత్రలు కథకు ఎమోషనల్ బలాన్ని ఇచ్చేలా ఉంటాయని సమాచారం. సంగీతాన్ని జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. 45 ఏళ్ల హీరో -20 ఏళ్ల హీరోయిన్ మధ్య ప్రేమ కథ అనగానే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇలాంటి కాన్సెప్ట్‌లు హిందీ, మలయాళ భాషల్లో ముందే వచ్చి హిట్ అయ్యాయి. మలయాళంలో 'హృదయపర్వం', హిందీలో 'దేదే ప్యార్ దే' లాంటి సినిమాలు ఇదే తరహా ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీలను చూపించాయి. ఇప్పుడు తెలుగులో అదే కాన్సెప్ట్‌తో సూర్య రావడం సాహసమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు... స్ట్రాంగ్ స్టోరీ, ఎమోషన్ ఉంటే వయసు తేడా పెద్ద విషయం కాదని అభిమానులు చెబుతున్నారు.

గత కొంతకాలంగా సూర్య ఖాతాలో భారీ బ్లాక్‌బస్టర్ పడలేదు. 'రెట్రో' తమిళంలో మంచి టాక్ తెచ్చుకున్నా... తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో 'Suriya 46' సూర్య కెరీర్‌లో చాలా కీలకంగా మారింది. డిఫరెంట్ కాన్సెప్ట్, స్ట్రాంగ్ ఎమోషన్, వెంకీ అట్లూరి టచ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం 'Suriya 46' వర్కింగ్ టైటిల్‌తోనే సినిమా సాగుతోంది. అయితే దీనికి 'విశ్వనాథన్ అండ్ సన్స్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: naga vamsi suriya mamitha baiju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X