Suriya 38 భాషల్లో సూర్య మూవీ.. ఐమాక్స్, 3డీ వెర్షన్‌తో సంచలనం దిశగా..
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు స్గూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో తమిళ సూపర్ స్టార్ సూర్య నటిస్తుండగా, దిశ పటానీ, బాబీ డియోల్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2024 వేసవిలో రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రం సంచలనాలు నమోదు చేస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సేషనల్ విషయాల్లోకి వెళితే..
కంగువా సినిమాను జానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ భారీగా ఖర్చుకు వెనుకాడకుండా నిర్మిస్తున్నారు. సూర్య విభిన్న పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా అందించబోతున్నారు. తొలి భాగాన్ని ఏప్రిల్ 2024 లో రిలీజ్ చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కంగువా సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశ పటానీ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఇక ఈ సినిమా రెండో భాగంలో దీపిక పదుకోన్‌ను రంగంలోకి దించేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. దాదాపు దీపిక నటించే విషయాన్ని చిత్ర యూనిట్ ధృవీకరించింది.
ఇక కంగువా సినిమా సాంకేతికంగా భారీ విలువలతో ఇంతకు ముందెన్నడూ చూడని కంటెంట్‌తో ప్లాన్ చేశారు. వెంట్రీ పళనిస్వామి సినిమాటోగ్రఫి, దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఐమాక్స్, 3డీ వెర్షన్‌లో రూపొందిస్తున్నట్టు సమాచారం.ఇండియాలోనే కనివినని రూపంలో సినిమా రూపొందించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న కంగువా సినిమాను ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాను 38 భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అన్ని భాషల ప్రేక్షకులకు సినిమా కంటెంట్‌ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











