Karuppu: సూర్యకు భారీ రెమ్యూనరేషన్.. ‘కరుప్పు'కు ఎన్ని కోట్లంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)నటించిన తాజా సినిమా కరుప్పు (Karuppu). తెలుగులో వీరభద్రుడు (Veerabhadrudu). ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్‌గా మారింది. విడుదలకు ముందు నుంచే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా స్ట్రాంగ్ స్టార్ట్ సాధించడం విశేషం. మే 14న విడుదల కావాల్సిన ఈ సినిమా ఒక రోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ఎలాంటి ప్రభావం పడలేదు. ఈ తరుణంలో హీరో సూర్య పారితోషికం హాట్ టాపిక్ గా మారింది.

కరుప్పు సినిమాకి ఆర్ జే బాలాజీ దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. ఇక హీరోయిన్‌గా త్రిష కృష్ణన్ నటించగా, యోగిబాబు, ఇంద్రన్స్, అనఘా మాయ రవి పాత్రలో కీలక పాత్రలు పోషించారు. సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందించారు. నిర్మాణ బాధ్యతలను ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు చేపట్టగా, తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌ విడుదల చేసింది.

Suriya Karuppu Salary Revealed Massive Rs 45 Cr Pay Strong Box Office Opening Buzz

ఇక ఈ మూవీ తొలి రోజు పాజిటివ్ టాక్ అందుకుంది. దీంతో భారీ కలెక్షన్స్ సాధించింది. మొదటి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే, తమిళ వెర్షన్ 'కరుప్పు' రూ.12 కోట్ల నెట్ సాధించగా, తెలుగు వెర్షన్ 'వీరభద్రుడు' రూ.2.40 కోట్లు రాబట్టింది. మొత్తంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నెట్ కలెక్షన్స్ రూ.14.40 కోట్లకు చేరాయి. గ్రాస్ పరంగా చూస్తే ఇండియాలో రూ.16.60 కోట్లు, ఓవర్సీస్ నుంచి మరో రూ.4 కోట్లు అందుకుంది. దీంతో వరల్డ్‌వైడ్ ఫస్ట్ డే గ్రాస్ సుమారు రూ.20.60 కోట్లకు చేరుకుంది. ఇది సూర్య కెరీర్‌లో ఇటీవల కాలంలో మంచి ఓపెనింగ్‌గా చెప్పుకోవచ్చు.

ఇక ఈ సినిమా ద్వారా మరోసారి చర్చకు వచ్చిన అంశం పారితోషికం. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, సూర్య ఈ చిత్రానికి దాదాపు రూ.45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది అతని కెరీర్ వన్ ఆఫ్ ది హైయ్యేస్ట్ రెమ్యూనరేషన్ అనే చెప్పాలి. ఇక హీరోయిన్ త్రిష సుమారు రూ.5 కోట్లు, ఆర్జే బాలాజీ రూ.4 కోట్లు, కమెడియన్ యోగిబాబు రూ.2 కోట్లు అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర నటీనటుల్లో ఇంద్రన్స్ రూ.80 లక్షలు, స్వసిక రూ.40 లక్షలు, జార్జ్ మరియన్ రూ.30 లక్షలు తీసుకున్నట్లు సమాచారం.

త్రిష పారితోషికం విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె కెరీర్ మళ్లీ పీక్స్‌లోకి వెళ్లిన నేపథ్యంలో, భవిష్యత్ ప్రాజెక్ట్స్‌కు భారీగా డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి. ముఖ్యంగా కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోల సినిమాల కోసం ఏకంగా రూ.12 కోట్ల వరకు రెమ్యునరేషన్ కోరుతున్నట్లు టాక్. ఈ లెక్కన చూస్తే 'వీరభద్రుడు' ఆమె తక్కువ పారితోషికంతో చేసిన చివరి తమిళ చిత్రం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా 'కరుప్పు' సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ స్టార్ట్ అందుకుంది.

Read more about: Karuppu suriya trisha krishnan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X