సూర్య-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సినిమా?
సౌత్ స్టార్ సూర్య, టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సినిమా రాబోతోందా? అంటే అవుననే వార్తలు తమిళ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 'గురు' ఫేం సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది.
సూర్య త్వరలో తన కజిన్ కె.ఇ.జ్ఞానవేల్ రాజాకు చెందిన స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించబోయే సినిమా చేయబోతున్నారని, 2019లో ఈ సినిమా మొదలు కాబోతోందని కొన్ని రోజులుగా తమిళ సినీ వర్గాల్లో టాక్. ఇది ఇద్దరు హీరోలు ఉండే కథ అని.... మరో పాత్రలో విజయ్ దేవరకొండను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు టాక్.

ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో ద్విబాషా చిత్రంగా ప్లాన్ చేస్తున్నారని, అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే ఉందని, అఫీషియల్ సమాచారం రావడానికి ఇంకా సమయం పడుతుందని అంటున్నారు.
ప్రస్తుతం సూర్య రెండు చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అందులో ఒకటి సెల్వరాఘవన్ తెరకెక్కిస్తున్న 'ఎన్.జి.కె'.... మరొకటి కెవి ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 37వ చిత్రం. కెవి ఆనంద్ చిత్రం సూర్య, మోహన్ లాల్, ఆర్యతో మల్టీ స్టారర్‌గా రూపొందుతోంది. సముద్రఖని, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
మరో వైపు విజయ్ దేవరకొండ హీరోగా స్టూడియో గ్రీన్ వారు నిర్మించిన 'నోటా' సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆనందర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ మూవీపై భారీ అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











