ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో...' : స్టోరీలో సర్ఫైజ్ ఇదే

By Srikanya

హైదరాబాద్‌: సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'నాన్నకు ప్రేమతో...' షూటింగ్‌ లండన్‌లో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కథలో ఓ సర్పైజ్ ఉండబోతోందని సమాచారం.అది మరేదో కాదు ఎన్టీఆర్ ద్వి పాత్రాభినయం చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకూ బయిటకు వచ్చింది ఎన్టీఆర్ ఒక పాత్ర గెటప్ అని, రెండో గెటప్ గోప్యంగా ఉంచాలని యూనిట్ నిర్ణయించుకుందని సమాచారం. గతంలోనూ ఎన్టీఆర్...అదుర్స్ చిత్రంలో డ్యూయిల్ రోల్స్ చేసారు. అది మంచి హిట్టైంది. అయితే ఈ డ్యూయిల్ రోల్ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం లేదు.

చిత్రం విశేషాలకు వస్తే....

ఎన్టీఆర్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 8,2016న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 22న టీజర్ ని విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే టైటిల్ లోగోను సెప్టెంబర్ 17న విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ని అఫీషియల్ గా చిత్ర నిర్మాణ సంస్ద తన ఫేస్ బుక్ ఎక్కౌంట్ ద్వారా ఖరారు చేసింది. అదేమిటో ఇక్కడ చూడండి.

Happy to announce that the first look of our #NTR25 project shall be out on 17th. Co produced by Reliance Entertainments. #NannakuPrematho

Posted by Sri Venkateswara Cine Chitra on 15 September 2015

పై మ్యాటర్ ప్రకారం ఈ సినిమాకి 'నాన్నకు ప్రేమతో...' అనే టైటిల్ నే ఖరారు చేసారు. మొదటి నుంచీ ఈ టైటిల్ ప్రచారంలో ఉన్నా టైటిల్ మారే అవకాసం ఉందని చాలా మంది భావించారు. అయితే ఇప్పుడు ఇచ్చిన ఈ అఫీషియల్ ఎనౌన్సమెంట్ తో టైటిల్ విషయం తెలిసిపోయింది.

అలాగే ఈ సినిమా కోసం లండన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ని 26 వ ఫ్లోర్ లో ఆఫీస్ సెట్ వేసారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న జగపతి బాబు ఆఫీసు గా ఇది కనిపించనుంది. ఇందుకోసం 60 లక్షలకు పైనే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ కు ముందు జగపతిబాబుకు, ఎన్టీఆర్ కు మధ్య వచ్చే కీలక సన్నివేశం కోసం ఈ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ సెట్‌కు రూపకల్పన చేశారని సమాచారం. అక్కడ లండన్ వర్కర్స్ కొందరు ఈ సెట్ నిర్మాణంలో పాలుపంచుకున్నట్లు చెప్తున్నారు.

Surprise From NTR's Nannaku Prematho!

దర్శకుడు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ని కొత్త తరహా పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తెరపై కనిపించే విధానం భిన్నంగా ఉంటుంది. ఇదివరకటితో పోలిస్తే మరింత స్త్టెలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ని తయారు చేయించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. ఆ తర్వాత స్పెయిన్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది'' అన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్ని తమిళంలో డబ్బింగ్ చేసి అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా కొందరు తమిళ నటుల్ని కీలకమైన పాత్రలకు తీసుకుందామనే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X