RRR అప్‌డేట్.. ఇండిపెండెన్స్ డే కానుక.. ఎన్టీఆర్ అభిమానులకు సర్‌ప్రైజ్

బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ 'RRR'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది జులై 30 వ తేదీన ఈ సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేశాడు జక్కన్న. అయితే తాజాగా RRR కి సంబందించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాలు చూస్తే..

షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్

షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్

గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న RRR సినిమా అప్‌డేట్స్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతుండటం, పైగా ఇద్దరు స్టార్ హీరోలు లీడ్ రోల్ పోషిస్తుండటం కారణంగా సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఈ నేపథ్యంలో షూటింగ్ చేస్తూనే ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలని ఫిక్స్ అయ్యారట రాజమౌళి.

ఎన్టీఆర్ అభిమానులకు సర్‌ప్రైజ్

ఎన్టీఆర్ అభిమానులకు సర్‌ప్రైజ్

ప్రమోషన్స్ లో భాగంగానే ఈ ఇండిపెండెన్స్ డే కానుకగా ఎన్టీఆర్ అభిమానులకు సర్‌ప్రైజ్ చేయాలని భావిస్తున్నారట జక్కన్న. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఆగస్టు 15వ తేదీన RRR సినిమాలోని ఎన్టీయార్ లుక్‌ను రివీల్ చేయబోతున్నారట రాజమౌళి. ఇదే జరిగితే ఈ ఇండిపెండెన్స్ డే ఎన్టీఆర్ అభిమానులకు ఎంతో స్పెషల్ అని చెప్పుకోవచ్చు.

 కియారా అద్వానీ పుట్టిన రోజు.. రామ్ చరణ్ లుక్

కియారా అద్వానీ పుట్టిన రోజు.. రామ్ చరణ్ లుక్

ఇకపోతే మరో హీరో రామ్ చరణ్.. ఇటీవలే కియారా అద్వానీ పుట్టిన రోజు సందర్బంగా కెమెరాకు చిక్కిన సంగతి తెలిసిందే. కోర మీసాలతో డిఫరెంట్ గా మేకోవర్ అయిన రామ్ చరణ్ ని చూసి మెగా అభిమానులు మురిసిపోయారు. RRR యూనిట్ నుంచి చెర్రీ అఫీషియల్ లుక్ బయటకు రానప్పటికీ, ఇదే లుక్ లో రామ్ చరణ్ కనిపిస్తారని ఫిక్స్ అయ్యారంతా.

 RRR మూవీ

RRR మూవీ

డీవీవీ దానయ్య సమర్పణలో RRR అనే వర్కింట్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎన్టీఆర్ హీరోయిన్ విషయంలో మరో క్లారిటీ రాలేదు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X