మాటల మాత్రికుడి పుట్టినరోజు.. మెగా అభిమానులకు సర్‌ప్రైజ్
'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'అల.. వైకుంఠపురములో'. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అతడి సరసన పూజ హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్, టబు, నివేథా పేతురాజ్, నవదీప్, మురళీ శర్మ తదితర నటులు కనిపించనున్నారు. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
రెండు సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో 'అల.. వైకుంఠపురములో' విషయంలో యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకుంటోందట. ఈ సినిమా కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అదిరిపోయే ఫ్యామిలీ డ్రామాను రాశాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన డైలాగులు ప్రధానాకర్షణ కానున్నాయని టాక్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే, ప్రీ టీజర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది.

ఇక, తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదే.. ఈ సినిమా టీజర్ గురించి. 'అల.. వైకుంఠపురములో' టీజర్ నవంబర్ 7న విడుదల కానుందట. ఆరోజు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు. కాబట్టి దీన్ని పురస్కరించుకుని ఆయన బన్నీ అభిమానులకు సర్‌ప్రైజ్ గిప్ట్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ వార్త తాజాగా బయటకు రావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.
మరోవైపు, ఎంతో ప్రతిష్టాత్మక వస్తున్న ఈ సినిమాను కేరళలో కూడా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందని ఓ వార్త తాజాగా బయటకు వచ్చింది. అయితే, ఇది తెలుగులో మాత్రం కాదు. మలయాళంలోకి ఈ సినిమాను డబ్బింగ్ చేస్తున్నారట. అక్కడ బన్నీకి భారీ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాను 'అంగు.. వైకుంతపురతు' అనే టైటిల్ ఫిక్స్ చేశారట.


Click it and Unblock the Notifications











