మహేష్ బర్త్ డే స్పెషల్.. ఆ రోజే 'సరిలేరు నీకెవ్వరు'.. సర్‌ప్రైజింగ్ న్యూస్
మహర్షి సినిమాతో సూపర్ సక్సెస్ ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు.. తన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమాకు 'సరిలేరు నీకెవ్వరు' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. 13 ఏళ్ల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.
ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. అజయ్ అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ ఆసక్తికర వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. మరో వారం రోజుల్లో అనగా ఆగస్టు 9 వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారని ఆ చర్చల సారాంశం. మహేష్ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ ఆగస్టు 9న సరిలేరు నీకెవ్వరు నుంచి మహేష్ లుక్ రిలీజ్ చేయాలని భావిస్తోందట చిత్రయూనిట్. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ.. ఇదే నిజమైతే మహేష్ ఆ రోజు అభిమానులకు రెండు పండుగలు అని చెప్పుకోవచ్చు.

ఇక ప్రస్తుతం యూత్ ఆడియన్స్‌లో యమ క్రేజ్ ఉన్న రష్మిక మందన్న.. మహేష్ బాబుతో రొమాన్స్ చేస్తే చూడాలని కుతూహలంగా ఉన్నారు ప్రేక్షకులు. అంతేకాదు విజయశాంతిని మరోసారి వెండితెరపై చూడాలని ఆత్రుత పడుతున్నారు ప్రేక్షకులు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్, కామెడీ అన్నీ సమపాళ్లలో రంగరించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట అని రావిపూడి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 'సరిలేరు నీకెవ్వరు' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











