రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’పై గజనీ సూర్య కెందుకంత కోపం...?
'రక్త చరిత్ర" చిత్రంలో మద్దెల చెరు సూరి పాత్రలో జీవించిన సూర్య ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విభజించి విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. కేవలం హిందీలో మాత్రమే అయితే రెండు భాగాలుగా విభజించుకున్నా మరెలా విడుదల చేసినా తనకు ఎలాంటి సమస్య లేదని, కానీ దక్షిణాదిలో తనకున్న ఫాలోయింగ్ దష్ట్యా ఛాన్స్ తీసుకోలేనని సూర్య తేల్చి చెప్పాడట. తొలి భాగంలో తనకసలు ప్రాధాన్యతే లేనప్పుడే తనో హీరోగా నటించానని ప్రచారం జరుగుతున్న ఈచిత్రం రెండు భాగాలుగా విడుదలైతే ఈ కథకు వివేక్ ఒబెరాయ్ హీరో అనుకునే అవకాశముందని, అంచేత ఈ చిత్రాన్ని ఏకమొత్తంగా విడుదల చేయాలని సూర్య సూచించాడట. సూర్య వాదన విన్న రామ్ గోపాల్ వర్మ అతని అభ్యర్థన మేరకు తమిళంలో ఈ చిత్రాన్ని ఒకే భాగంగా విడుదల చేస్తున్నాడు. తెలుగు, హిందీలో మాత్రం రెండు భాగాలుగానే విడుదల చేశాడు.
తమిళంలో 'రక్త చరిత్ర" చిత్రం నవంబర్ 19న తెలుగు, హిందీల్లో రెండో భాగంతో పాటు విడుదలవుతుంది. తమిళ్ లో తొలి భాగమంతా బాగా ఎడిట్ చేసి సూర్య ఎంట్రీ మొదటి అరగంటలోనే జరిగేలా చూసుకున్నారు. అందుకే 'రక్తచరిత్ర" హిందీ, తెలుగు ప్రదర్శన తమిళనాడులో లేకుండా జాత్రత్త పడ్డారు. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో రెండు భాగాలుగా విడుదల చేయడం పట్ల సూర్య కోపంగా ఉన్నాడట. అందుకే ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్పంచుకోవడం లేదట.


Click it and Unblock the Notifications











