Don't Miss!
- Finance
Boeing: నిరుద్యోగులకు శుభవార్త.. వేలాది మందిని రిక్రూట్ చేసుకోనున్న జెట్ లైనర్
- News
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత..!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
తమిళ్ స్టార్ హీరో డైరెక్ట్ తెలుగు సినిమా.. గట్టిగా కొట్టాలని ప్లానింగ్?
తెలుగు ఆడియెన్స్ సాధారణంగా ఎలాంటి సినిమా వచ్చినా ఆదరించడానికి రెడీగా ఉంటారు. కంటెంట్ బావుంటే బాషాభేదం చూపించకుండా ఎంకరేజ్ చేయడంలో టాలీవుడ్ ముందుంటుంది. తమిళ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అక్కడ సక్సెస్ అయిన చాలా సినిమాలు ఇక్కడ అనువాదమవుతున్న విషయం తెలిసిందే.
Recommended Video

సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా..
కోలీవుడ్ స్టార్ హీరో అనడం కన్నా సూర్యని సౌత్ స్టార్ హీరో అనడం బెటర్. ఎందుకంటే సూర్య ఏ సినిమా చేసినా అవి తమిళ్ లొనే కాకుండా తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. అయితే ఎప్పటినుంచో సూర్య డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు. చాలా రోజుల తరువాత సూర్య ఒక కొత్త తరహా ప్లాన్ వేశాడని సమాచారం.

రైటర్స్ తో సిట్టింగ్..
టాలీవుడ్ లో ఉన్న కొంతమంది ప్రముఖ రచయితలతో సూర్య రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారట. గత కొన్ని నెలలుగా సూర్య తెలుగు వాళ్లకు నచ్చేలా పూర్తి తెలుగుధనం కనిపించేలా ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. కథ ఏ మాత్రం నచ్చినా మంచి దర్శకుడిని సెలెక్ట్ చేసుకొని వచ్చే ఏడాదికి ఒక డైరెక్ట్ తెలుగు సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని సూర్య తపన పడుతున్నాడు.

హిట్టొచ్చి చాలా కాలమవుతోంది..
ఒకప్పుడు సూర్య సినిమా రిలీజ్ అవుతోంది అంటే తమిళ్ ఆడియెన్స్ తో పాటు తెలుగు వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు తమిళ్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్నంతగా సూర్య టాలీవుడ్ జనాలను ఎట్రాక్ట్ చేయలేకపోతున్నాడు. బందోబస్త్- NGK అంటూ డిఫరెంట్ సినిమాలతో వచ్చినప్పటికీ ఆ సినిమాలు టాలీవుడ్ లో అంతగా క్లిక్కవ్వలేదు.

అందుకే ఈ ఆలోచన..
గత కొన్నేళ్లుగా సూర్య తెలుగు మార్కెట్ చాలా తగ్గిపోయింది. అతన్ని తెలుగు జనాలు మర్చిపోయారని కోలీవుడ్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అందుకే డైరెక్ట్ గా తెలుగు ఆడియెన్స్ కి నచ్చేలా ఒక సినిమా చేయాలని సూర్య ఆలోచిస్తున్నాడు. అప్పట్లో బాహుబలిలో కట్టప్ప పాత్రకు సూర్యని అనుకున్నారు గాని అతను ఒప్పుకోలేదు. ఇక త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందన్నారు గాని అది రూమర్ అని ఫాస్ట్ గానే తెలిసిపోయింది. ఇక ఇప్పుడు మాత్రం సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.