»   »  ఫుల్లుగా తాగి మరీ ఆ హీరోని మొహమ్మీదే తిట్టిందట

ఫుల్లుగా తాగి మరీ ఆ హీరోని మొహమ్మీదే తిట్టిందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

అటు కంగనా హృతిక్ ల వివాదం సాగుతూండగానే ఇటు ఇంకో జంట బ్రేకప్ వివాదం కూడా ముదురుతోంది. బాలీవుడ్ కు బ్రేకప్ అనే పదం బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. లవర్స్ మాత్రమే కాదు భార్యాభర్తలు కూడా పదేళ్ల బంధం తర్వాత విడిపోతూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా అలాంటి బ్రేకప్ మరొకటి బాలీవుడ్ లో జరిగింది.

సుశాంత్, బుల్లితెర నటి అంకితా లోఖాండేలు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఒక దసలో ఇద్దరికీ వివాహం జరగ బోతోందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇంతలో ఏమైందో కానీ.అంకితతో బ్రేకప్ అయినట్లు సుశాంత్ సన్నిహితుల వద్ద చెప్పాడు.

ట్విట్టర్లో కూడా తన బ్రేకప్ విషయాన్ని ""ఆమె బాగా డ్రింక్ చేస్తేనేమి, నేను ఆడవాళ్లతో క్లోజ్ గా ఉంటేనేం ఏది ఏమైనా మా బ్రేకప్ జరిగిపోయింది" అంటూ ట్వీట్ చేసి. తమ మధ్య వచ్చిన దూరాన్ని స్పష్టంగా పేర్కొన్నాడు సుశాంత్. ఇప్పుడు వారిద్దరి మధ్య మాటలు కూడా లేవని అతడి సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల వచ్చిన వార్తలు చూసి ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరూ జీవితాన్ని పంచుకుంటారని ఆశపడ్డారు. కానీ, ఇంతలోనే బ్రేకప్ వార్తలు ప్రచారం జరిగాయి.

Sushant Singh Rajput says Ankita Lokhande abusing him

బ్రేకప్ విషయాన్ని మొదటపెట్టింది సుశాంత్. అంతటితో ఆగకుండా అంకితాతో విడిపోవడానికి గల కారణాలను ఒక్కొక్కటిగా లీక్ చేస్తున్నాడు. ఓ ప్రైవేట్ పార్టీలో టీవీ నటి అంకితా ఫుటుగా తాగి లవర్ సుశాంత్ పై నోరు పారేసుకుందట. ఇష్టం వచ్చినట్లు సుశాంత్ ను తిట్టిందట.

ఈ విషయాలు అక్కడి మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సుశాంత్, అంకితల బ్రేకప్ లో హీరోయిన్ కృతీసనన్ ప్రమేయం ఉందని వదంతులు వినిపించాయి. అంకిత కూడా ఈ విషయంలోనే సుశాంత్ తో తరచూ గొడవ పడేదని బాలీవుడ్ టాక్.

తనతో క్లోజ్ గా ఉన్నందుకు తనపై తనకే విరక్తిగా ఉందని, ఇంకా ఏవో మాటలన్నదని సుశాంత్ ట్వీట్ చూస్తే అర్థమవుతోంది. తనకు ప్రేమించడం ఎలాగన్నది తెలుసునంటూ అంకితా కూడా ఈ మధ్య ట్వీట్ చేసింది. బ్రేకప్ అయిన తర్వాత ఇప్పటివరకూ వీరిద్దరూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ, విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

English summary
Ex Girlfriend Ankita Lokhande got drunk nverbally and abused SushantSingh Rajput
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu