‘గబ్బర్ సింగ్’ లో పవన్ బద్రర్ గా అక్కినేని హీరో..!?
సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్ రూపొందిన సూపర్ హిట్ చిత్రం 'దబాంగ్", ఇదే చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాన్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో గణేష్ బాబు 'గబ్బర్ సింగ్" అనే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రం జూలైలో ప్రారంభం కాబోతోంది. 'దబాంగ్"లో సల్మాన్ కు తల్లిదండ్రులుగా నటించిన వినోద్ ఖన్నా, డింపుల్ కపాడియాల పాత్రలలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, సహజనటి జయసుధ నటించనున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బ్రదర్ గా అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటించనున్నాడని ఫిలింనగర్ సమాచారం.
ముందు ఈ పాత్ర కోసం హీరో శ్రీకాంత్ ని, ఆ తర్వాత అజయ్ ని ఎంపిక చేసుకొన్నారని ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆ పాత్రకు సుశాంత్ ని ఎంపిక చేసుకున్నారని ఫిలింనగర్ టాక్. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులతో రూపొందనున్న ఈ చిత్రాన్ని జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారట...


Click it and Unblock the Notifications











