Bhola Shankar: చిరంజీవి బావగా అక్కినేని హీరో.. ఆ సీన్స్ మాత్రం హైలైట్
గతంలో కంటే ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ.. 40 ఏళ్ల కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత బిజీగా గడుపుతోన్నారు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. రీఎంట్రీలో రెట్టించిన జోష్‌తో కనిపిస్తోన్న ఆయన.. ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించి మెప్పించారు. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చేశారు. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్పందన దక్కింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చాలా చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నారు. అందులో తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కుతోన్న 'భోళా శంకర్' ఒకటి. దీన్ని టాలీవుడ్‌లో ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరున్న మెహర్ రమేశ్ తీస్తుండడంతో ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇక, ఈ మూవీ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే కొన్ని షెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేశారు. ఇలా ఇప్పటి వరకూ సగం కంటే ఎక్కువ భాగాన్నే షూట్ చేసుకున్నారు.

క్రేజీ కాంబోలో రాబోతున్న 'భోళా శంకర్' మూవీలో చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఇందులో ఆమెకు జోడీగా నటించాల్సిన ఓ యంగ్ హీరో పాత్ర కూడా ఉంది. దీనికి ఎవరిని తీసుకోవాలన్న దానిపై చిత్ర యూనిట్ చాలా సమయం తీసుకుని ఎన్నో పేర్లను పరిశీలించింది. ఇలా ఈ పాత్రను నితిన్ కానీ, నాగశౌర్య కానీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, దీనికోసం ఇప్పుడు అక్కినేని కాంపౌండ్‌కు చెందిన సుశాంత్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని అతడి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్స్ హైలైట్‌గా ఉంటాయని అంటున్నారు.

'భోళా శంకర్' మూవీలో చిరంజీవికి జోడీగా తమన్నా భాటియా చేస్తోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











