టాలీవుడ్‌లోకి మరో మెగా వారసురాలు: సూపర్ హిట్ మూవీ రీమేక్‌తో ఎంట్రీ.. ఆ హీరోతో కలిసి ప్లాన్

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఆ కుటుంబ పెద్ద అయిన చిరంజీవే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చూపిన బాటలోనే ఆ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో చాలా మంది స్టార్లుగా వెలుగొందుతున్నారు. అదే సమయంలో నాగబాబు కుమార్తె నిహారిక కూడా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆమె ఈ ఫీల్డ్‌లో సక్సెస్ కాకున్నా పేరు మాత్రం తెచ్చుకుంది. ఇప్పుడీ క్రమంలోనే మరో మెగా వారసురాలు నటిగా పరిచయం కాబోతుందట. ఇంతకీ ఎవరామె? ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Megaatar Chiranjeevi Daughter To Debut In Tamil Remake | సక్సెస్ అవుతుందా?

కొంటె చూపులతో కవ్విస్తోన్న సమంత (బర్త్‌డే స్పెషల్ ఫొటోలు)

 వాళ్లంతా హీరోలుగా.. ఆమె హీరోయిన్‌గా

వాళ్లంతా హీరోలుగా.. ఆమె హీరోయిన్‌గా

మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయన సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్ల తర్వాత రెండో తరానికి సంబంధించిన రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, కల్యాణ్ దేవ్ వంటి వాళ్లు హీరోలుగా పరిచయం అయ్యారు. అదే సమయంలో నిహారిక కూడా ఆ ఫ్యామిలీ నుంచి వారసురాలిగా ఎంటర్ అయింది.

వాళ్ల బాటలోనే సుస్మిత కూడా ఎంటర్

వాళ్ల బాటలోనే సుస్మిత కూడా ఎంటర్

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురైన సుస్మిత కూడా సినిమా రంగంతో అనుబంధాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే చాలా రోజుల క్రితమే ఆమె స్టైలిస్ట్ కమ్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా తన తండ్రి సినిమాలకు పని చేసింది. అందుకే ఆయన కమ్‌బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150'లో ఆయన ఎంతో యంగ్‌గా కనిపించారని ప్రశంసలు వచ్చాయి. సైరాకు కూడా వర్క్ చేసిందామె.

నిర్మాతగా అడుగు.. ఆ వెబ్ సిరీస్‌ చేసి

నిర్మాతగా అడుగు.. ఆ వెబ్ సిరీస్‌ చేసి

మెగాస్టార్‌ చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల, తన భర్త విష్ణుతో కలిసి నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గోల్డ్ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించిన ఈ జంట.. 'షూటౌట్ ఎట్ ఆలేరు' అనే వెబ్ సిరీస్‌ను సైతం నిర్మిస్తున్నారు. దీనితో పాటు మరికొన్ని చిత్రాలను, సిరీస్‌లను కూడా రూపొందిస్తామని గతంలోనే ప్రకటించింది సుస్మిత కొణిదెల.

సూపర్ హిట్ మూవీ రీమేక్ హక్కులు

సూపర్ హిట్ మూవీ రీమేక్ హక్కులు

ఇప్పటికే ఓ వెబ్ సిరీస్‌ను ప్రకటించిన సుస్మిత కొణిదెల.. ఇప్పుడు ఓ చిత్రంతో టాలీవుడ్‌లోకి సైతం నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన '8 తొట్టిక్కల్' అనే సినిమా రీమేక్ హక్కులను ఆమె సొంతం చేసుకున్నట్లు రెండు రోజులుగా ఓ వార్త వైరల్ అవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేయబోతుందని సమాచారం.

క్రైమ్ థ్రిల్లర్‌ ‘8 తొట్టిక్కల్' మూవీ కథ

క్రైమ్ థ్రిల్లర్‌ ‘8 తొట్టిక్కల్' మూవీ కథ

శ్రీ గణేష్ అనే దర్శకుడు తెరకెక్కించిన చిత్రమే '8 తొట్టిక్కల్'. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ఓ నిజాయితీ పోలీస్ ఆఫీసర్‌కు చెందిన ఓ తుపాకీ ఓ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో అనుకోకుండా మాయమవుతుంది. అది ఒక దొంగ తస్కరిస్తాడని తెలుస్తుంది. దాన్ని అతడు వేరే వాళ్లకు అమ్ముతాడు. అలా అలా చేతులు మారుతూ ఉంటుంది. చివరికి అది ఎలా దొరికిందనేదే మిగిలిన కథ.

టాలీవుడ్‌లోకి మరో మెగా వారసురాలు

టాలీవుడ్‌లోకి మరో మెగా వారసురాలు

'8 తొట్టిక్కల్' మూవీ కోసం సుస్మిత ఇప్పటికే దర్శకుడిని కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఈ సినిమాలో ఆమె కూడా కీలక పాత్రను పోషిస్తుందట. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నటిగానూ ఆమె ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. అలాగే, ఇందులో ఓ యంగ్ హీరో కూడా నటించబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X